అన్వేషించండి

Deputy CM criticizes Pawan : రూ. 35 వేల కోట్ల స్కాంకు ఆధారాలున్నాయా ? - జనసేనానిపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం

Andhra News : ప్రధానికి పవన్ కల్యాణ్ రాసిన లేఖపై ఏపీ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. రూ. 35వేలకోట్ల స్కాంకు ఆధారాలు చూపించాలన్నారు.

Kottu Satyanarayana :   పేదలందరికీ భూమి పేరుతో రూ. 35,141 కోట్ల మేర దోపిడి జరిగిందని, ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. దీంతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.  ముందుగా పవన్ కల్యాణ్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలన్నారు.  రూ.  35 వేల కోట్ల కుంభకోణం జరిగిందనడానికి పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు అసలు సిస్టమ్‌ అంటే ఏందో తెలియదన్నారు. చంద్రబాబు వద్ద ఉడిగం చేయడానికి పవన్ సిద్ధమయ్యారని విమర్శించారు. 

ఇళ్ల స్థలాలు ఇచ్చింది జగనేనన్న మంత్రి 
  
చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే జరిగాయని ఆరోపించారు. ఈ స్కాముల్లో పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఉందా? అని  కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.  పవన్ రాసిన లేఖపై మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్‌ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు.  సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ ఇంటర్‌పోల్‌తోనూ విచారణ జరిపించాలని అంటారేమోనన్నారు.  దేశంలో ఎక్కడలేని విధంగా లక్షలాది మందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు రూ.35 వేల కోట్ల స్కామ్ అంటే తేలికైన విషయమని పవన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

పవన్‌వి తింగరి మాటలు                      

కాపులు తనకు ఓట్లు వేయలేదని అని పవన్ కల్యాణ్ అంటున్నారని, అసలు ఆయనకు ఓట్లు వేసిన ఇతర వర్గాల వారూ లేరని విమర్శించారు.  జనసేన అభ్యర్థులను గెలుపించుకోవాలనే ఆలోచన పవనకు లేదన్నారు. ఉదయం ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. సాయంత్రం చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకోవడమే పవన్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం పవన్‌కు లేదని మండిపడ్డారు.   పవన్ తింగరి మాటలు మాట్లాడటం మానుకోవాలని డిప్యూటీ సీఎం గట్టు సత్యనారాయణ హెచ్చరించారు.

మోదీకి పవన్  రాసిన లేఖలో ఏముందంటే ?                      

 ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget