News
News
X

Compassionate Appointment: సీఎం జగన్ కీలక నిర్ణయం... కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశాలు

సీఎం జగన్ కొవిడ్ కారుణ్య నియామకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

FOLLOW US: 
 
Compassionate Appointments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కొవిడ్ వాక్సినేషన్ తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.

Also Read: గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్

News Reels

కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

అంతకు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు. . రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌సహా పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా రాష్ట్రానికి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. 

Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?

థర్మల్ విద్యుత్ 69 మిలియన్ యూనిట్లకు పెంపు

రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని సీఎం జగన్ తెలిపారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం అన్నారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. 

Also Read:   కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... విద్యుత్ కొరత రాకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Oct 2021 07:56 PM (IST) Tags: cm jagan ap govt AP Latest news Breaking News compassionate appointments coivd deaths

సంబంధిత కథనాలు

Weather Latest Update: బంగాళాఖాతంలో త్వరలో తుపాను! ఏపీపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD అధికారులు ఏం చెప్పారంటే

Weather Latest Update: బంగాళాఖాతంలో త్వరలో తుపాను! ఏపీపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD అధికారులు ఏం చెప్పారంటే

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

నెల్లూరులో మెకానిక్‌ కాలాన్ని వెనక్కి తిప్పేస్తున్నారు!

నెల్లూరులో మెకానిక్‌ కాలాన్ని వెనక్కి తిప్పేస్తున్నారు!

టాప్ స్టోరీస్

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?