అన్వేషించండి

Case On Chandrababu : చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు - ఈ సారి ఇసుక విషయంలో !

చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. దీంతో కలిసి ఆరు కేసులు నమోదు చేసినట్లయింది.


Case On Chandrababu :  ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగిస్తోంది. రోజు మార్చి  రోజు కేసు నమోదు చేస్తోంది. తాజాగా ఇసుక విషయంలో  ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ కేసు నమోదుచేశారు.  ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.  ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

పశువుల కొనుగోలు పేరిట రూ.2 వేల కోట్లకు పైగా భారీ స్కామ్? - ప్రభుత్వంపై నాదెండ్ల సంచలన ఆరోపణలు

చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపించారు.  ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదని... ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ అని సీఐడీ తెలిపింది.  ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారని సీఐడీ తెలిపింది.   ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు భిన్నంగా ఉందన్నారు.  ట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారని సీఐడీ తెలిపింది.  అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టలేదన్నారు. ఈ కేసులో దేవినేని ఉమను కూడా చేర్చారు. ఆయన జలవనరుల మంత్రిగా ఉన్నారు. 

వైసీపీ పాలనపై ఎంపీ రఘురామ పిటిషన్ - అవినీతిపై విచారణ కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం

రెండు రోజుల క్రితం మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని సీఐడీ ఓ కేసు పెట్టింది. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్లకు అక్రమంగా అనుమతి ఇచ్చారని  కేసు నమోదు చేసింది.  గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలకు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఆరోపిస్తూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌  ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఐ.శ్రీనివాస శ్రీనరేష్‌, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలపై సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది.  వాసుదేవరెడ్డి ఈ నెల 11న ఫిర్యాదు ఇవ్వగా.. 28న సీఐడీలో కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ అధికారులు సోమవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. తాజా కేసును కూడా ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించనున్నారు. 

చంద్రబాబుపై ఇప్పటికి ఆరు కేసులు నమోదు చేశారు. స్కిల్ డెలవప్‌మెంట్  ప్రాజెక్టులో స్కాం జరిగిందని ఆరోపించి అరెస్టు చేశారు. తనపై కేసులన్నీ అక్రమం అని తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు రావాల్సి ఉంది. ఈ లోపే.. రెండు రోజులకో  కేసు నమోదు  చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని కేసుల్లోనూ డబ్బులు దుర్వినియోగం అయ్యాయని.. ప్రభుత్వానికి నష్టం జరిగిందని వాదిస్తున్నారు కానీ.. ఫలానా ఆర్థిక  లబ్ది చంద్రబాబుకు కానీ.. ఇతరులకు కానీ అందిందని నిరూపించలేకపోతూడటంతో సీఐడీ, ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
AP Local Body Elections Live updates: ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget