AP Cabinet : బావ పదవి బావమరిదికి - కేబినెట్ లిస్ట్ లో ట్విస్టులు!
AP Cabinet : ఎన్నో మలుపులు తిరిగిన మంత్రుల జాబితా ఫైనల్ అయింది. ముందు బావకు పోస్ట్ ఖాయమని వార్తలు వచ్చాయి కానీ చివరికి బావమరిదినే పదవి వరించింది.
AP Cabinet : ఏపీ నూతన మంత్రి వర్గంలో గంట గంటకూ మార్పులు చేర్పులు జరిగాయి. ఉదయం వచ్చిన ఊహగానాలు మధ్నాహ్నం మారిపోయాయి. ఫైనల్ లిస్ట్ వచ్చేసింది వీళ్లే మంత్రులు అని మీడియా సంస్థలు వెల్లడించేసిన తర్వాత కూడా మంత్రుల జాబితాలో మార్పులు జరిగాయి. అందులో భారీగా షాక్ తిప్పేస్వామికి తగిలింది. తిప్పేస్వామికి మంత్రి పదవి ఖాయం అయిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే పేరు మారిపోయింది. బావ పదవి బావమరిదికి కేటాయించారని తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కలేదని బాలినేని, తిప్పేస్వామి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మొదట కేబినెట్ లిస్ట్ లో తిప్పేస్వామి పేరు రాగా చివరి నిమిషంలో ఆదిమూలపు సురేష్‍కు చోటు దక్కింది. తిప్పేస్వామికి ఆదిమూలపు సురేష్ కు బావమరిది అవుతారు. తిప్పేస్వామికి మంత్రి పదవి కోసం బాలినేని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 2009లో వైఎస్సార్ దగ్గర తిప్పేస్వామి చక్రం తిప్పి బావమరిది సురేష్ కు టికెట్ ఇప్పించారు. ఇప్పుడు ఆయనకే పదవి దక్కకపోవడం బావమరిదే ఎసరు పెట్టరాని తిప్పేస్వామి అనుచరులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్‌లో మంత్రుల లిస్ట్ జిల్లాల వారీగా ఇలా!
శ్రీకాకుళం (Ministers From Srikakulam)
2.సిదిరి అప్పలరాజు
విజయనగరం (Ministers From Vizianagaram)
3.బొత్స సత్యనారాయణ
4.రాజన్న దొర
విశాఖపట్నం (Ministers From Visakhapatnam)
5.గుడివాడ అమర్నాధ్
6.ముత్యాలనాయుడు పుడు
తూర్పుగోదావరి (Ministers From East Godavari)
7.దాడిశెట్టి రాజా
8.పినిపే విశ్వరూప్
9.చెల్లుబోయిన వేణు
పశ్చిమగోదావరి (Ministers From West Godavari)
10.తానేటి వనిత
11.కారుమూరి నాగేశ్వరరావు
12.కొట్టు సత్యనారాయణ
కృష్ణా (Ministers From Krishna)
13.జోగిరమేశ్...
గుంటూరు (Ministers From Guntur)
14.అంబటి రాంబాబు
15.మెరుగు నాగార్జున
16.విడదల రజని
నెల్లూరు (Ministers From Nellore)
17.కాకాని గోవర్ధన్ రెడ్డి
చిత్తూరు (Ministers From Chittore)
18.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
19.నారాయణ స్వామి
20. ఆర్కే రోజా
కడప (Ministers From Kadapa)
21.అంజాద్ బాషా
కర్నూలు (Ministers From Kurnool)
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
23. గుమ్మనూరి జయరాం
అనంతపురం జిల్లా (Ministers From Anantapur)
24.ఉషా శ్రీ చరణ్
ప్రకాశం జిల్లా (Ministers From Prakasam)
25. ఆదిమూలపు సురేష్
పలు చోట్ల ఆందోళనలు
ఏపీ కొత్త కేబినెట్ వైసీపీ ముసలం పుట్టించింది. మంత్రి వర్గంలో మా నేతలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. సీనియర్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పలువురు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. కృష్ణా జిల్లాకు మంత్రి పదవుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కడంపై ఆందోళనలకు దిగారు.