AP BJP On Dharmana : ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ముందా ? ధర్మానకు ఏపీ బీజేపీ సూటి ప్రశ్న !
ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని వైఎస్ఆర్సీపీని ఏపీ బీజేపీ సవాల్ చేసింది. ధర్మాన సొంత అభిప్రాయం చెప్పి ఉంటే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.
AP BJP On Dharmana : విశాఖను రాజధాని చేయకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఘాటుగా స్పందించింది. మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా ? అని ఆ పార్టీ ధర్మాన ప్రసాదరావును ప్రశ్నించిదంి. ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా ..ధర్మనా అభిప్రాయమా చెప్పాలని డిమాండ్ చేసింది. ధర్మాన అబిప్రాయం అయితే ధర్మానను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా.. అని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.
ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్న ఏపీ బీజేపీ
ఉత్తరాంధ్రకు ధర్మాన ఏం చేశారో చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్ధానికి మీరు ఇచ్చిన హామీ నెరవేరిందా...జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. జగన్న తోడు అనేది కేంద్ర ప్రభుత్వం పథకం..15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. మీ దోపిడీకి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నారా... అని ప్రశ్నించారు. మీరు అభివృద్ధి చేస్తే వలసలు ఎందుకు జరుగుతున్నాయని .. వైసిపి ప్రభుత్వ వైఫల్యలపై ప్రజా చార్జీ సీటు వేస్తామని ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో !
22 ఏ లో భూములను టీడీపీ వైస్సార్సీపీ ప్రభుత్వలు చేరుస్తున్నాయి.. అమ్మకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 22 ఏలో ఉన్న రైతు భూముల వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదన్నారు. అంశాల వారిగా విపక్షాలు కలవడం సాధారణంగా జరిగేది.. రాజకీయ అంశంగా ముడి పెట్టడం సరి కాదని.. పవన్, చంద్రబాబు భేటీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీలో గదుల అద్దె విపరీతంగా పెంచుతున్నారు..పెంచిన అద్దెలను వెంటనే తగ్గించాల్సిందేనన్నారు. అద్దెలు తగ్గించాలని 12 తేదీన ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తామని ప్రకటించారు. 23, 24 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో నిర్వహిస్తామమని.. సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తాము.. రెండు రాజకీయ తీర్మానం చేస్తామని ప్రకటించారు.
చంద్రబాబుకు అవసరమైనప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ
హిందువులు, హిందు దేవాలయాలు పై దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందని.. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కి అవమానం చేయలేదా.. ప్రధాన తల్లిని విమర్శించలేదా.. అమిత్ షాపై రాళ్ల దాడి చేయించలేదా.. అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తర్వాత మోడీ చుట్టూ తిరుగుతున్నారరని మండిపడ్డారు. బీజీపీ ఓక జాతీయ పార్టీ తక్కువ అంచనా వేయవద్దు ... రాష్ట్రంలో మా రాజకీయ ఆలోచనలు కేంద్ర పార్టీ సరైన సమయంలో అమలు చేస్తుందని తెలిపారు.