అన్వేషించండి

Vizag Law And Order : మీ ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు - ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు !

ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించలేని వారు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ఏపీ బీజేపీ ప్రశ్నించింది. శాంతిభద్రతలపై అమిత్ షా ప్రశ్నిస్తే వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

 

Vizag Law And Order  :    విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ ఘటన విశాఖలో శాంతిభద్రతల పరిస్థితిని బయట పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ లో నిర్వహించిన బహిరంగసభలో విశాఖలో శాంతి భద్రతల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. నేరగాళ్లు విశాఖలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. అయితే ఈ విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖలో శాంతిభద్రతలు లేవని.. భూ కబ్జాలు జరుగుతున్నాయని.. ఇప్పుడు తెలిసిందా అని .. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు ఎదురుదాడి చేశారు. 

అయితే వైఎస్ఆర్‌సీపీ కీలక నేతలు ఎదుురుదాడి చేసి .. కొన్ని గంటలు కాక ముందే విశాఖలో ఎంపీ కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది.  ఎంపీ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు ఏకంగా రెండు రోజుల పాటు వారిని నిర్బంధంలో ఉంచుకోవడం సంచలనం అవుతోంది. 

ఈ ఘటనపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు. శాంతిభద్రతలపై బీజేపీ విశాఖలో సభలో మాట్లాడితే  మంత్రులు, నేతలు  మీడియాలు ముందు గగ్గోలుపెట్టారు. నేడు ఏకంగా మీ ఎంపీ  కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. మీ ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ప్రశ్నించారు. తప్పును ఒప్పుకొని బిజెపి కి క్షమాపణ చెప్పి, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య , కుమారుడితో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసింది రౌడీషీటర్ హేమంత్ అని పోలీసులు గుర్తించారు.  గతంలోనూ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కిడ్నాప్ చేసి..  డబ్బులు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. భీమిలికి చెందిన రామకృష్ణ అనే టీడీపీ నేతలు ఇలాగే కిడ్నాప్ చేసి.. రూ. కోటి డిమాండ్ చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకేసులో  జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలాగే విజయారెడ్డి అనే మాజీ మహిళా కార్పొరేటర్ హత్య కేసులోనూ హేమంత్ నిందితుడిగా ఉన్నారు.   హేమంత్.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనుచరుడిగా చాలా కాలం ఆయన వెంటే  తిరిగారని వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాకుండా.. సినిమాలు నిర్మిస్తూంటారు. ఎంవీవీ సినిమాలు నిర్మిస్తున్న సమయంలో ...  హేమంత్ ఆయన చుట్టూనే ఉండేవారని చెబుతున్నారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత కూడా చాలా కాలంగా ఆయన వెంటే ఉన్నారని.. తర్వాత .. ఎంపీ పేరు చెప్పి దందాలు చేస్తున్నారని దూరం పెట్టినట్లుా చెబుతున్నారు. ఈ కారణంగానే ఎంపీ కుటుంబసభ్యులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయని.. అందుకే సులువుగా కిడ్నాప్ చేయగలిగారని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget