Helpline Numbers for AP People: భారత్, పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ వారికి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే
Andhra Pradesh News | భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు, విద్యార్థులు తిరిగి తమ రాష్ట్రాలకు ప్రయాణం అవుతున్నారు.

Operation Sindoor News | న్యూఢిల్లీ: భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నవారు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగం కోసం, చదువుల కోసం ఏపీ నుంచి సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 350 మంది ఏపీ భవన్ కు చేరుకున్నట్లు సమాచారం. విద్యార్థులు పంజాబ్, జమ్ము కాశ్మీర్, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. కాల్పుల విరమణ అనంతరం సైతం పాకిస్తాన్ డ్రోన్ దాడులు, కాల్పులు జరుపుతుండడంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.
ఏపీ భవన్‌కు వస్తున్న విద్యార్థులు
ఢిల్లీలోని ఏపీ భవన్‌కు శనివారం వరకు 91 మంది విద్యార్థులు చేరుకోగా, ఆదివారం నాటికి ఆ సంఖ్య 350 కి చేరినట్లు ఏపీ భవన్ తెలిపింది. ఏపీ భవన్ సిబ్బంది విద్యార్థులకు రైల్వే టికెట్లు బుక్ చేయడంతో పాటు, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు వెళ్లడానికి ట్రావెలింగ్ ఫెసిలిటీ సైతం కనిపిస్తుంది ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ఏపీ విద్యార్థులు, రాష్ట్రానికి చెందిన ఎవరైనా
ఏపీ భవన్‌ను 011-23387089, మొబైల్ నంబర్లు 98719 99053, 98719 99430లలో సంప్రదించాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సూచించారు. రాష్ట్రానికి చెందిన వారికి ఏదైనా సహాయం కావాలన్నా, అదనపు సమాచారం కోసం 98719 90081లో ఏపీ భవన్ డిప్యూటీ కమిషనర్ ఎంవీఎస్ రామారావును, 98183 95787 నెంబర్‌లో లైజన్ ఆఫీసర్ సురేష్‌బాబును సంప్రదించవచ్చని ఏపీ భవన్ పేర్కొంది.






















