అన్వేషించండి

Breaking News Live: ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on January 14 Friday Breaking News Live: ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు
ప్రతీకాత్మక చిత్రం

Background

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఇదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎంపీ మోపీదేవి వెంకటరమణ, అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకులు భగవన్ శ్రీ సత్య సాయి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, సినీ నటుడు శ్రీకాంత్ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ మధుసూదన్ సాయి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాల్లో ఉదయం అల్పారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 50 వేల మంది పిల్లలకు ప్రతి రోజు అల్పాహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి
నటుడు కొంచాడ శ్రీనివాస్ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 47  ఏళ్లు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పట్టణం ఆయన స్వగ్రామం. ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా సొంతూరు వెళ్లారు. అనారోగ్య సమస్యలతో అక్కడే తుదిశ్వాస విడిచారు.
కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అనూహ్యంగా కింద పడటంతో ఆయనకు ఛాతి మీద బలమైన దెబ్బ తగిలిందని సమాచారం. అప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లగా... గుండెల్లో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ సమస్య కారణంగా ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ కోసమని ఊరు వచ్చిన శ్రీ‌నివాస్‌కు మ‌రోసారి ఆరోగ్య సమస్య తలెత్తిందని, ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిసింది. కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

కొంచాడ శ్రీనివాస్ రూపం, ముఖ్యంగా కళ్లు అతడిని అందరి మధ్య ప్రత్యేకంగా నిలిపాయి. ఆయనకు వేషాలు తెచ్చిపెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీస్', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆది', 'ప్రేమ కావాలి' తదితర సినిమాలు చేశారు. సుమారు 40 సినిమాలు, పది సీరియళ్లలో ఆయన నటించారు.
కొంచాడ శ్రీ‌నివాస్‌కు త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఉన్నారు. తండ్రి ఐదు సంవత్సరాల క్రితం, తమ్ముడు పది సంవత్సరాల క్రితం మరణించారు. ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇద్దరూ అత్తగారి ఇళ్లలో ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల చలన చిత్ర పరిశ్రమలో స్నేహితులు, సొంతూరి ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. 

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తులానికి రూ.130 పెరిగింది. వెండి ధరలోనూ కిలోకు రూ.1,500 పెరుగుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.1,500 పెరిగి రూ.67,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,300గా ఉంది.

22:07 PM (IST)  •  20 Jan 2022

ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

ములుగు జిల్లా పస్రా తాడ్వాయి మధ్య ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ వెనుక నుంచి కొట్టింది.  ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వస్తున్నట్లు సమాచారం. 

20:05 PM (IST)  •  20 Jan 2022

పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపును  కొట్టివేసిన హైకోర్టు

పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న జీవోలు జారీ అయింది. దీనిపై కొందరు విద్యార్థులు టీఏఎఫ్ఆర్ సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ విచారించిన హైకోర్టు పీజీ వైద్య ఫీజుల పెంపుపై  తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్ సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని స్పష్టం చేసింది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget