AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,925 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 184 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,442కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 134 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,318 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,149 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 30th November, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 30, 2021
COVID Positives: 20,70,014
Discharged: 20,53,423
Deceased: 14,442
Active Cases: 2,149#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JXVKq0UMrY
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,909కి చేరింది. గడచిన 24 గంటల్లో 134 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,442కు చేరింది.
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన నెలకొంది. అయితే రోజువారి కరోనా కేసులు మాత్రం తక్కువగానే నమోదయ్యాయి. కొత్తగా 6,990 కరోనా కేసులు నమోదుకాగా 190 మంది వైరస్ వల్ల మృతి చెందారు. 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,45,70,274
- మొత్తం మరణాలు: 4,68,980
- యాక్టివ్ కేసులు: 1,00,543
- మొత్తం కోలుకున్నవారు: 3,40,18,299
యాక్టివ్ కేసుల సంఖ్య 546 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,543గా ఉంది. మృతుల సంఖ్య 4,68,980కి పెరిగింది. గత 53 రోజులుగా కరోనా కేసుల సంఖ్య 20 వేల కంటే తక్కువగానే ఉంది. గత 155 రోజులుగా ఈ సంఖ్య 50 వేల కంటే తక్కువే ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.29గా ఉంది. కొవిడ్ రికవరీ రేటు 98.35గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. సోమవారం ఒక్కరోజే 78,80,545 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ 1,23,25,02,767కు చేరింది.
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి