AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 168 కరోనా కేసులు, ఇద్దరు మృతి..తెలంగాణలో 137 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో 2,425 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో 137 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,040 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 168 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,425కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 301 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,54,056 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,425 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 19th November, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 19, 2021
COVID Positives: 20,68,011
Discharged: 20,51,161
Deceased: 14,425
Active Cases: 2,425#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ruAIhIwnnE
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,906కి చేరింది. వీరిలో 20,54,056 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 301 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,425కు చేరింది.
Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!
తెలంగాణలో 137 కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 31,054 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 137 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్క రోజు వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 3,979కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 173 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇంకా 3,657 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే... వరదలపై ప్రధాని మోదీ ఆరా
Also Read: అసెంబ్లీలో అనుమానాస్పదంగా మార్షల్ తీరు.. అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతా సిబ్బంది !
Also Read: బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో వైఎస్సార్‌సీపీ పాగా.. టీడీపీ కోటకు బీటలు!
Also Read: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం