Andhra Pradesh Students: వావ్ గ్రేట్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అరుదైన అవకాశం
Andhra Pradesh Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే SDG సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నారు.
![Andhra Pradesh Students: వావ్ గ్రేట్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అరుదైన అవకాశం Andhra Pradesh Students to Showcase Govt’s Reforms in Education Sector at United Nations Andhra Pradesh Students: వావ్ గ్రేట్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అరుదైన అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/89567012e3d2910bfb475f7c037d478e1694956618514798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Students: అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు మెరిశారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక, యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మరియు కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రభుత్వ సంస్కరణల గురించి
ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడడడంతో పాటు ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో ఈ విద్యార్థులు వివరిస్తారు.
అందరూ సాధారణ కుటుంబాలకు చెందినవారే
ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ విద్యార్థులు అందరూ చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ‘పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సదస్సులో పాల్గొంటున్నారు.
అంతర్జాతీయ వేదికల్లో మెరిసేలా
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ పర్యటన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా, నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
వరల్డ్ బ్యాంకులోనూ అవకాశం
25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న 'నాడు-నేడు' కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ప్రతినిధుల బృందాన్నిపూర్తి ప్రభుత్వ వ్యయంతోనే ఈ అమెరికాకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విధ్యార్దులకు దక్కిన ఈ అరుదైన గౌరవం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోనే తొలి సారిగా ఏపీ ప్రభుత్వ బడుల్లో చదువుతన్న ఈ విద్యార్ధులకు దక్కిత ఈ అరుదైన అవకాశం పైన చర్చ సాగుతోంది. ఈ విద్యార్దులకు ప్రశంసలు లభిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)