AP Lok Sabha Result 2024: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ మెజార్టీల్లో టాప్ లేపిన బాలకృష్ణ చిన్నల్లుడు- తగ్గేదేలే అంటున్న పెమ్మసాని, హరీష్
AP Lok Sabha Election Result 2024 Updates: ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల్లో కూటమి పై చేయి సాధించింది. విన్నింగ్ రేస్‌లో ఫ్యాన్ పార్టీ పల్టీలు కొట్టింది.
Telugu News Today: 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో జరిగినవి ఒక ఎత్తు అయితే... ఆంధ్రప్రదేశ్‌లో జరిగినవి మరో ఎత్తు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోలింగ్, చివరకు కౌంటింగ్ వరకు అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి జెండా ఎగిరింది. 25 ఎంపీ స్థానాలకు అర్థరాత్రి వరకు జరిగిన లెక్కింపులో కూటమి పార్టీలు 21 స్థానాలు గెలుచుకోగా వైసీపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి నాలుగుకు పరిమితం అయ్యింది. కూటమిలో టీడీపీ 16 చోట్ల విజయం సాధించగా.... జనసేన రెండు సీట్లలో జయకేతనం ఎగరేశారు. బీజేపీ ఆరు స్థానాలకు మూడు చోట్లే విజయం సాధించింది.
కూటమిగా కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 17 చోట్ల పోటీ చేసి 16 స్థానాలు కైవశం చేసుకుంది. జనసేన రెండింటింకి రెండును గెలుచుకుంది. ఒక్క బీజేపీ మాత్రం మూడు స్థానాలు కోల్పోయింది. మూడింటిలో మాత్రమే నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో బీజేపీ తర్వాత ఎక్కువ స్థానాలు నెగ్గిన పార్టీగా టీడీపీ ఉంది.
జనసేన అసెంబ్లీ సీట్లలోనే కాదు లోక్‌సభ సీట్లలో కూడా వందకు వంద శాతం ఫలితాలు సాధించింది. కూటమితో పోటీ చేసిన జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. అన్నింటిలో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. పదే పదే పవన్ చెప్పినట్టు ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదని... తీసుకున్న వాటిలో ఎన్ని గెలుచుకున్నామనేది ముఖ్యమని చెబుతూ వచ్చారు. ఆయన పిలుపు మేరకు జనసైనికులు తీసుకున్న అన్ని సీట్లలో విజయం కట్టబెట్టారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం లోక్ స్థాల్లో విజయం సాధించింది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ గెలుపొందారు.
టీడీపీ ఈసారి 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. అందులో 16 స్థానాలు గెలుచుకుంది. ఒక్క కడప సీటులోనే ఓడిపోయింది. ఇక్కడ కూడా గట్టి పోటీని ఇచ్చింది.
నియోజకవర్గం | విజేత | మెజార్టీ | పార్టీ | ప్రత్యర్థి | |
1 | అరకు | చెట్టి తనూజ రాణి | 50,580 | వైసీపీ | కొత్తపల్లి గీత |
2 | శ్రీకాకుళం | కింజరాపు రామ్మోహన్ నాయుడు | 3,27,901 | టీడీపీ | పేరాడ తిలక్ |
3 | విజయనగరం | కలిశెట్టి అప్పలనాయుడు | 2,38,216 | టీడీపీ | బెల్లాన చంద్రశేఖర్ |
4 | విశాఖ | మతుకుమిల్లి భరత్ | 5,04,247 | టీడీపీ | బొత్స ఝాన్సీ |
5 | అనకాపల్లి | సీఎం రమేష్ | 2,96,530 | బీజేపీ | బూడి ముత్యాల నాయుడు |
6 | కాకినాడ | తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ | 2,29,491 | జనసేన | చెలమలశెట్టి సునీల్ |
7 | అమలాపురం | గంటి హరీష్ | 3,42,196 | టీడీపీ | రాపాక వరప్రసాద్ |
8 | రాజమండ్రి | పురందేశ్వరి | 2,39,139 | బీజేపీ | డా. గూడురి శ్రీనివాసులు |
9 | నర్సాపురం | భూపతిరాజు శ్రీనివాస వర్మ | 2,76,802 | బీజేపీ | గూడూరి ఉమా బాల |
10 | ఏలూరు | పుట్టా మహేశ్ యాదవ్ | 1,78,326 | టీడీపీ | కారుమూరి సునీల్ కుమార్ |
11 | మచిలీపట్నం | వల్లభనేని బాలశౌరి | 2,23,179 | జనసేన | సింహాద్రి చంద్రశేఖర్ రావు |
12 | విజయవాడ | కేసినేని చిన్ని | 2,82,082 | టీడీపీ | కేసినేని నాని |
13 | గుంటూరు | పెమ్మసాని చంద్రశేఖర్ | 3,44,695 | టీడీపీ | కిలారి వెంకట రోశయ్య |
14 | నరసరావుపేట | లావు కృష్ణదేవరాయులు | 1,59,729 | టీడీపీ | అనిల్ కుమార్ యాదవ్ |
15 | బాపట్ల | టి.కృష్ణ ప్రసాద్ | 2,02,941 | టీడీపీ | నందిగాం సురేష్ బాబు |
16 | ఒంగోలు | మాగుంట శ్రీనివాసులురెడ్డి | 48,911 | టీడీపీ | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి |
17 | నంద్యాల | శబరి(టీడీపీ) | 1,36,278 | టీడీపీ | పోచా బ్రహ్మానందరెడ్డి |
18 | కర్నూలు | బస్తిపాటి నాగరాజు | 1,11,298 | టీడీపీ | బివై రామయ్య |
19 | అనంతపురం | అంబికా లక్ష్మీనారాయణ | 1,08,293 | టీడీపీ | మాలగుండ్ల శంకర నారాయణ |
20 | హిందూపురం | బీకే పార్థ సారథి | 1,25,607 | టీడీపీ | జోలదరసి శాంత |
21 | కడప | అవినాష్ రెడ్డి | 65,490 | వైసీపీ | షర్మిల |
22 | నెల్లూరు | వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి | 2,45,902 | టీడీపీ | విజయసాయిరెడ్డి |
23 | తిరుపతి | మద్దిల గురుమూర్తి | 14,569 | వైసీపీ | వరప్రసాద్(బీజేపీ) |
24 | రాజంపేట | మిథున్ రెడ్డి | 76,071 | వైసీపీ | కిరణ్ కుమార్ రెడ్డి |
25 | చిత్తూరు | దగ్గుమళ్ల ప్రసాదరావు | 2,20,479 | టీడీపీ | ఎన్ రెడ్డప్ప |