AP Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 5,879 కేసులు, 7 మరణాలు
ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 7 గురు మరణించారు. రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,284 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 5,879 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 7గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,615కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,384 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,51,238 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,10,517 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 31st January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 31, 2022
COVID Positives: 22,76,370
Discharged: 21,51,238
Deceased: 14,615
Active Cases: 1,10,517#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/1iyqgRFtlJ
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,76,370కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,384 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,615కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,24,70,712 శాంపిల్స్ పరీక్షించారు.
ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో గిరిజన విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అడ్డతీగల గంగవరం మండలంలోని ఆశ్రమ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అరకొర వసతులతో విద్యార్థులు ఐసోలేషన్ కొనసాగిస్తున్నారు. ఇమ్యూనిటీ ఆహారం అందడంలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కరోనాతో బాధపడుతున్నా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 15 వేల వరకు పాజిటివ్ కేసులు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ కొవిడ్19 మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో పోరాడుతూ ఆదివారం 959 మంది మరణించారు. నిన్న ఒక్కరోజులో 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో నిన్న ఒక్కరోజులో 2,62,628 (2 లక్షల 62 వేల 628) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268కు దిగొచ్చింది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే బాగానే తగ్గాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
Also Read: 'గూండాలు' అన్న ప్రధాన మంత్రి.. దండాలు పెట్టిన కేంద్ర మంత్రి!