AP Corona Updates: ఏపీలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 12 వేలకు పైగా కేసులు, 12 మరణాలు
ఏపీలో కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 12 మంది మరణించారు. రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
![AP Corona Updates: ఏపీలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 12 వేలకు పైగా కేసులు, 12 మరణాలు Andhra Pradesh latest corona updates 28th January records 12,561 new covid 19 cases 12 deaths in 24 hours AP Corona Updates: ఏపీలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 12 వేలకు పైగా కేసులు, 12 మరణాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/28/82478d5464bf18b40cef4b385df7715a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గలేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 40,635 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 12,561 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 12 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,591కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,742 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,20,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,13,300 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 28th January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022
COVID Positives: 22,45,713
Discharged: 21,17,822
Deceased: 14,591
Active Cases: 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/k3HkY8Gbkw
15 వేలకు చేరువలో మరణాలు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,48,608కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,742 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,591కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,23,65,775 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 2,51,209 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. 627 మంది మృతి చెందారు. 3,47,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,80,24,771కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611గా ఉంది. రికవరీ రేటు 93.60గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 15.88గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 17.47గా ఉంది. నిన్న ఒక్కరోజే 15,82,307 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 72.37 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.
కోవిడ్ చుక్కల మందుకు డీజీసీఐ అనుమతి
కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న దశలో ఓ శుభవార్త వచ్చింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు'గా వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో జరగనున్నాయి. దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ బూస్టర్ డోసుపై మరోసారి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు సూత్రప్రాయంగా డీసీజీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)