Mukesh Ambani: అంబానీ మెచ్చిన కడియం మొక్క... ఖరీదెంతో తెలుసా..!
ముఖేశ్ అంబానీ ఆంధ్రా మొక్కపై మక్కువపడ్డారు. గుజరాత్ లోని ఓ జూపార్క్ కోసం ఈ మొక్కను కొనుగోలు చేశారు. అక్షరాలా రూ.25 లక్షలు పెట్టి కొన్న ఈ మొక్కకు ఓ స్పెషాలిటీ ఉంది.
వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కడియం మొక్కపై మనసుపడ్డారు. అపరకుబేరుడు మెచ్చిన ఈ మొక్కకు అంతే స్పెషాలిటీ ఉందండోయ్. చూడడానికి చెట్టులా ఉంటే మొక్క అని ఎందుకు పిలుస్తున్నారు. అసలు ఈ మొక్కనే ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసుకునేందుకు ఈ కథనాన్ని చదవాల్సిందే.
Also Read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ముఖేశ్ అంబానీ గుజరాత్ లో నిర్మించే జూపార్కులో వివిధ ప్రాంతాలకు చెందిన మొక్కలు, చెట్లు ఉంచాలని నిర్ణయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, చెట్లు సేకరించి ఈ జూపార్కులో పెడుతున్నారు. ఇప్పుడు ఈ జూపార్క్ లో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ మొక్కలు కూడా చేరుతున్నాయి. కడియం నర్సరీలకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇక్కడి మొక్కలు, పూలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతుంటాయి. గుజరాత్‌లో నిర్మిస్తున్న జూపార్కులో విభిన్న రకాల ప్రఖ్యాత మొక్కలను సేకరించి పెట్టాలన్న ఆలోచనతో ప్రపంచంలో అరుదుగా లభించే అత్యంత ఖరీదైన మొక్కలను సేకరిస్తున్నారు. దీంతో కడియం గౌతమీ నర్సరీలో లభించే మొక్కలను ఈ జూపార్క్ కోసం ఆర్డర్ ఇచ్చారు. ప్రత్యేక కంటైనర్ల ద్వారా ఈ మొక్కలను గుజరాత్ తరలిస్తున్నారు.
Also Read: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు
స్పెయిన్ నుంచి కడియం నర్సరీకి
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలు ఆన్‌లైన్‌లోనూ తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రెండేళ్ల క్రితం స్పెయిన్ నుంచి ఆలూస్ కల్పవృక్షం అని పిలిచే స్సైరల్ ఫైకస్, ఫారెస్ట్ ఫైకస్ అరుదైన మొక్కలను సముద్రమార్గం ద్వారా విశాఖపట్నం రప్పించి అక్కడి నుంచి కడియం నర్సరీకు తీసుకొచ్చారు. వెయ్యేళ్లు బతికే ఈ మొక్కల ప్రస్తుత వయస్సు 182 సంవత్సరాలు. వీటిని మొక్కలుగానే పరిగణిస్తారని నర్సరీ యజమాని చెపుతున్నారు. ఈ మొక్కలను గురించి తెలుసుకున్న జూపార్కు నిర్వాహకులు ఆలూస్ మొక్కలు ఆర్డర్ చేశారు. ఒక్కొక్కటి రూ. 25 లక్షలకు రెండు ఆలూస్ మొక్కలను కొనుగోలు చేశారు. స్సైరల్ ఫైకస్, ఫారెస్ట్ ఫైకస్ లతో పాటు విభిన్న రకాలైన మొత్తం 19 మొక్కలను కడియం నుంచి ప్రత్యేక కంటైనర్ లో గుజరాత్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కడియం నర్సరీ మొక్కను అంబానీ కొనుగోలు చేయడంతో మరోసారి కడియం పేరు మారుమోగుతోంది.
Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి