అన్వేషించండి

Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు

Andhra News: నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసుల డ్యాం వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో కృష్ణా రివర్ బోర్డు అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నెంబర్ వద్ద ఏపీ పోలీసులు (AP Police) కంచె ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ బోర్డు (Krishna River Board) నిబంధనల ప్రకారం 13వ నెంబర్ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అందుకే కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతుండగా, దీన్ని తొలగించేందుకు శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీసులు యత్నించగా వీరిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు యత్నిస్తుండగా, నాగార్జున సాగర్ కంట్రోల్ రూంను ఐజీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డ్యాం వద్ద ఏపీ పోలీసులు 1500 మంది, తెలంగాణ పోలీసులు 1000 మంది ఉన్నట్లు సమాచారం.

డ్యాం వద్దకు కృష్ణా బోర్డు సభ్యులు

తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు తాజాగా నాగార్జున సాగర్ డ్యాం వద్దకు చేరుకుని పరిశీలించారు. సీఈ అజయ్ కుమార్, ఇరిగేషన్ అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులతో చర్చిస్తున్నారు. కాగా, ఇప్పటికే సాగర్ డ్యాం నుంచి ఏపీకి నీరు విడుదలవుతుండగా, సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 522 అడుగులకు చేరింది. అయితే, మరో 12 అడుగుల మేర నీటిని వదిలితే డెడ్ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. 

ఏపీ పోలీసులు, అధికారులపై కేసు

మరోవైపు, ఏపీ పోలీసులపై నల్గొండ జిల్లా విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యాంపైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఏ1గా పేర్కొంటూ ఏపీ పోలీసులు, అధికారులపై కేసు నమోదైంది.

కేంద్రం ఆరా

అటు, ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తోంది. స్థానిక నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు వివాదం ఏంటంటే.?

రాష్ట్ర విభజన సమయంలోనే కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ టైంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయించారు. అయితే, ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి నీటిని ఏపీకి తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే, గతంలో కృష్ణా బోర్డు ఆదేశించినా నీళ్లు విడుదల చేయలేదని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు.  తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. సాగర్ నుంచి నీటి విడుదలకు ఈ 2 నెలల్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. అయితే, గత కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని తమ పరిధిలో ఉన్న 13 గేట్ల నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, తమపై దాడి చేసి సీసీలు ధ్వంసం చేసి ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ పోలీసులు, అధికారులు చెబుతున్నారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదైంది.

Also Read: AP Police: ఏపీ పోలీసు అధికారుల పల్లెనిద్ర-శాంతి భద్రతలపై ఫోకస్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget