అన్వేషించండి

Andhra News: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన - భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

Indrakeeladri Works: ఇంద్రకీలాద్రిపై రూ.200 కోట్లకు పైగా చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.

CM Jagana Inaugurated Development Works in Indrakeeladri: సీఎం జగన్ (CM Jagan) గురువారం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ (Master Plan) ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దుర్గగుడిని రూ.225 కోట్లతో పూర్తిగా అభివృద్ధి చేసేందుకు సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ క్రమంలో సీఎం వాటికి శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందించారు. శంకుస్థాపనల అనంతరం పూర్తైన నిర్మాణాలను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తైన అనంతరం సీఎం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

అభివృద్ధి పనులివే

  • రూ.57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ.30 కోట్లతో అన్న ప్రసాద భవన నిర్మాణం
  • రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజగోపురం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం
  • రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్, రూ.7.75 కోట్లతో కనకదుర్గా నగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం
  • రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు, రూ.19  కోట్లతో నూతన కేశ ఖండన శాల నిర్మాణం, రూ.10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయం మార్పు
  • రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్ రాతి యాగశాల నిర్మాణం, రూ.33 కోట్ల దేవస్థానం - ప్రైవేట్ భాగస్వామ్యంతో కనకదుర్గానగర్ వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం చేపడతారు.

ప్రారంభోత్సవాలివే

రూ.5.60 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మల్లేశ్వర స్వామి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్ టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తి కాగా, వాటిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే, దేవాదాయ శాఖ నిధులు రూ.3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణం పనులు పూర్తి కాగా వాటిని కూడా ప్రారంభించనున్నారు. అటు, పాతపాడులోని ఆలయానికి చెందిన స్థలంలో రూ.5.66 కోట్లతో ఓ మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన ఆలయాలను సైతం సీఎం ప్రారంభించనున్నారు.

మరికొద్ది నెలల్లో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది. ప్రస్తుత అభివృద్ధి పనులతో దుర్గగుడి వద్ద భక్తుల ట్రాఫిక్ కష్టాలకు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Weather Latest Update: తగ్గిన సైక్లోన్ ఎఫెక్ట్! - నేడూ వర్షాలు తక్కువే: ఐఎండీ వెల్లడి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget