Anantapur: ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరుతో కొత్తరకం సైబర్ నేరం - అనంతపురం పోలీసుల అలర్ట్
AP News: ఏపీలో జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాల గురించి అనంతపురం పోలీసులు అవగాహన కల్పించారు. తాజాగా ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
AP Cyber Crime: ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరిట జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. అపరిచితుల నుండీ ఫోన్ కాల్ మీ మొబైల్ ఫోన్ కు వస్తుంది. అవతలి వ్యక్తి విదేశాల నుండీ ఫోన్ చేస్తున్నానని నమ్మబలుకుతూ మాటలు కలిపేస్తాడు. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఫోన్ సంభాషణలో నటించి ఆ కాల్ అంతటితో కట్ చేసేస్తాడు. ఇంకో అపరిచిత నంబర్ నుంచి ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకుంటారు. మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు.
నాకు కొరియర్ రావాల్సినవి వస్తువులేమీ లేవని వారికి మీరు చెప్పినప్పటికీ వాళ్లు మీ పేరు, ఫోన్ నంబరు చెప్పడంతో.. ఆ వివరాలు నావే అని చెప్పేస్తారు. ఆ తర్వాత ఆ కొరియర్లో డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పి నమ్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ ను మీ ద్వారా తెలుసుకొని మీ మీద ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తారు. ఆతర్వాత ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం నుండి ఫోన్ చేస్తున్నామని నమ్మించి మిమ్మలను ఒక హోటల్ రూమ్లో కానీ ఇంటిలోనే ఒక గదిలో కానీ ఒంటరిగా ఉండమని చెప్పి స్కైప్ కాల్స్ లో మాట్లాడుతూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు.. తరువాత ఫైన్ కట్టాలని మోసగించి మొత్తం డబ్బులను వారి అకౌంటు వేయించుకుంటారు ఈ విధంగా కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారాని ఎలాంటి సైబర్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండలని సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ మీద నిజంగా ఏదయినా పోలీస్ కేసులో వుంటే సంబంధించిన పోలీస్ ఆఫీస్ నేరుగా వస్తారు అంతేగాని వాట్సాప్ లో కాల్ చేసి Skype, Video కాల్ అంటూ ఎవరు చేయరు. అలా చేసినట్లయితే వారు సైబర్ నేరగాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా... సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం చేరవేయాలి లేదా కనీసం మీ కుటుంబ సభ్యులతో విషయాన్ని పంచుకోవాలి.వాట్సాప్ లో మీ యొక్క/ మీ ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రొఫైల్ ఫోటో గా పెట్టకపోవడం మంచిది మీ వ్యక్తిగత డీటెయిల్స్ ను అనవసరంగా అపరిచితులకు ఇవ్వడం అంత మంచిది కాదన్నారు.
వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకుడదనీ.. మీకు తెలియని వ్యక్తి పరిచయం అయితే ఎట్టి పరిస్థితులలో వారు పెట్టే రిక్వెస్ట్ ని Accept చేయకూడదనీ వివరించారు. వ్యక్తి గత వివరాలను సోషియల్ మీడియా నందు గోప్యంగా ఉంచాలి. బహుమతులు గెలుచుకున్నారు అని వచ్చే email అండ్ మెసేజెస్ ల గురించి స్పందిచవద్దు. మీరు మీ ఫ్యామిలీ తో గాని లేక మీరు గాని ఎక్కడికయినా వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సనల్ డేటా అనవసరంగా పొందుపరచరాదు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు లేదా ww.cybercrime.gov.in నందు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ విజ్ఞప్తి చేశారు.