అన్వేషించండి

Vijaya Sai Reddy : కాకినాడ పోర్టు వివాదంలో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే, సీఐడీకి చెప్పిన విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy On Port Case: కాకినాడ పోర్టు వివాదంలో కర్తకర్మ క్రియ అంతా విక్రాంత్‌రెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో సీఐడీ విచారణకు హజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Vijaya Sai Reddy Comments On Kakinada Port Case: కాకినాడ పోర్టు వివాదంలో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో డీల్ మొత్తం కుదిర్చింది వైవీసుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే అని చెప్పారు. ఇదే విషయాన్ని సీఐడికి చెప్పినట్టు వివరించారు. 

ఈ కేసులో ఆది నుంచి అంతం వరకు ఎక్కడ కూడా తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఇందులో తన ప్రమేయం ఎంత ఉందో అనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు మీడియాకు వివరించారు. 

సీఐడీ : కేవీ రావూ మీకు తెలుసా?
విజయసాయిరెడ్డి: కేవి రావుతో ముఖ పరిచయమే తప్ప ఎలాంటి ఆర్థిక రాజకీయ, సామాజిక సంబంధాలు లేవు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌లో కనిపిస్తే విష్ చేసుకుంటాం. 

సీఐడీ : ఐదు వందల కోట్ల రూపాయలు అరబిందోలోకి ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి తెలుసా? 
విజయసాయిరెడ్డి: ఇది నాకు సంబంధం లేదు. తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు. నా కుమార్తెను వాళ్లకు ఇచ్చానే తప్ప వాళ్ల వ్యాపారాల్లో కానీ, ఆర్థిక అంశాల్లో కానీ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోను. భవిష్యత్‌లో కూడా చేసుకోను. ఎటువంటి సంబంధాలు లేవు. కుటుంబ సంబధాలే తప్ప ఆర్థిక సంబంధాలు లేవు 

సీఐడీ : విక్రాంత్ రెడ్డి మీకు తెలుసా?
విజయసాయిరెడ్డి: విక్రాంత్ రెడ్డి నాకు తెలుసు. సుబ్బారెడ్డి కుమారుడిగా నాకు తెలుసు. 

సీఐడీ : కాకినాడ వివాదంలో లావాదేవీలు విక్రాంత్ రెడ్డి చేసినట్టు చాలా మంది చెప్పారు. జగన్‌ను కాపాడటానికి మీరు, విక్రాంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా?
విజయసాయిరెడ్డి: నాకు ఈ లావాదేవీలకు సంబంధం లేదు. నా పై ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్‌ ద్వారా కేవీ రావును అడిగించాను. ఓ అధికారి ప్రమేయంతోనే విజయసాయి రెడ్డి పేరు పెట్టించినట్టు కేవీ రావు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి, కేవీ రావు అత్యంత ఆప్త మిత్రులు. నేను కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కాలిఫోర్నియాలో ఉన్న కేవీరావు రాజభవనంలోనే ఉంటారు. ఈ వివాదాన్ని విక్రాంత్ రెడ్డే డీల్ చేసినట్టు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్‌కు చెప్పారు. 

సీఐడీ : ఆడిట‌్ ఫామ్స్‌ వాళ్లు మీ పేరే చెబుతున్నారు
విజయసాయిరెడ్డి: ఎవరైతే చెబుతున్నారో వాళ్లను వెంకటేశ్వరుడి సాక్షిగా చెప్పమనండి. మీరు చెప్పే ఆడిట్ కంపెనీలు గురించి నాకు తెలియదు. 

సీఐడీ : శ్రీధర్ రెడ్డి అండ్ సంతానం కంపెనీని మీరే రికమండే చేశార అంటకదా. 
విజయసాయిరెడ్డి: ఇదే విషయాన్ని ధనంజయ్ రెడ్డినే అడిగితే మీకు సంబంధం లేదని చెప్పారు. ఈ కంపెనీని ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఉన్న కరికాలవళ్లవన్‌ తన అధికారులను ఉపయోగించి అపాయింట్ చేశాడని చెప్పారు. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. 

సీఐడీ : కాకినాడ పోర్టు కేసులో ప్రధాన లబ్ధిదారుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆయన్ని తప్పించేందుకే విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారా ?
విజయసాయిరెడ్డి: అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. అసలు ఇలాంటి ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్టు కూడా తెలియదు. అల్లుడి బ్రదర్‌ కంపెనీలో తాను ఎలాంటి జోక్యం చేసుకోను. వ్యాపారాలు కంటే కుటుంబ సంబంధాలు ముఖ్యం. అందులో ఉద్యోగాలు కోసం కూడా అడగను. 
"కాకినాడ సీ పోర్టు వివాదంలో జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, అరబిందోకు డీల్ చేసిందంతా విక్రాంతే రెడ్డే. ఆయన కర్త కర్మ క్రియ అనే విషయాన్ని చెప్పాను. గతంలో ఎందుకు సైలెంట్‌ అయ్యారో అనేది కేవీ రావును అడగాలి. నేను అడగలేను కదా. ఆయనంటే నాకు అసహ్యం. అసలు నా పాత్ర ఏముందని నన్ను ఇంకోసారి పిలుస్తారు. ఈ కేసు ఇక్కడితో ఆగిపోయినా అగకపోయినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు."

లేటరైట్స్‌ మైనింగ్‌లో విక్రాంత్ రెడ్డి వేల కోట్లు ఆర్జించినట్టు మీకు తెలుసా అని అడిగితే తనకు తెలియదని చెప్పినట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాదర్బారు పెట్టినప్పుడు ఉద్యోగాల కోసం కొంతమంది వస్తే వాటిని ఆయనకు సూచించాను. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పినట్టు వివరించారు. అక్కడ వ్యాపారం చేశారా లేదా అని తెలియదన్నారు.  
జగన్ సీబీఐ కేసుల్లో తాను ఏ2గా ఉన్నాను కాబట్టే ఇకపై నమోదు అయిన ఏ కేసులో అయినా తనను ఏ2గా పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. అందుకే కాకినాడ పోర్టు వాటాల విషయంలో తనపేరును ఏ2గా చేర్చాలని చెప్పుకొచ్చారు. కాకినాడ పోర్టు వాటల విషయంలో సీఐడీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజర్యాయారు. 

కాల్ రికార్డ్స్ తీస్తే కేవీరావుతో తాను మాట్లాడినట్టు కానీ, తనతో కేవీరావు మాట్లాడి ఉంటే తెలిసిపోతుందని విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. ప్రజాదర్బారు పెట్టినప్పుడు ఉద్యోగాల కోసం జనం అడిగితే ఫోన్లు చేసేవాడిని. అంతే తప్ప ఎవరి వద్ద కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదన్నారు. 

ఇప్పుడు సీఐడికి తాను వాస్తవాలే చెప్పానని తెలిపారు. ఎవరెవరు ప్రమేయం ఉందో తెలిపాను. ఓ అధికారి బలవంతంతోనే తన పేరును ఈ కేసులో ఇరికించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ అధికారి ఎవరూ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయిన విజయసాయిరెడ్డి... తనకి కూడా ప్రొటెక్షన్ కావాలని... ఆ అధికారి పేరు చెప్పి తాను ఎందుకు వాళ్లకు వ్యతిరేకం కావాలని ప్రశ్నించారు. ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు అని చెప్పారు. ఈ కేసును ఎవరు డ్రాఫ్ట్ చేశారో కేవీరావు తనకు కామన్ ఫ్రెండ్ ద్వారా చెప్పారని తెలిపారు. 

లిక్కర్ స్కామ్‌ విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి కెలికేశారు. ఆ స్కామ్‌లో పాత్రధారిసూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని వెలుగులోకి వస్తాయని తెలిపారు. భయం అనేది తన బ్లడ్‌లో లేదని అన్నారు. భక్తి అనేది ఉందన్నారు. ఇప్పుడు కూడా ఉందన్నారు. గతంలో నాయకుడిపై భక్తి ప్రేమ ఉండేదని ఇప్పుడు వెంకటేశ్వరస్వామిపైనే భక్తి ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి తనకు చాలా పదవులు ఇచ్చారని కాని అవమానాలు కూడా ఉన్నాయని తెలిపారు. పడ్డ కష్టాలు అన్నీ తలచుకుంటే మనసు విరిగిపోయే బయటకు వచ్చేశాను. 

జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్లిపోతున్నారు. మూడు తరాలుగా ఉన్నా కాదనలేదు. ఆత్మగౌరవం చాలా ముఖ్యం. నన్ను ప్రలోభాలకు లొంగలేదు. భయపడలేదన్నారు. విశ్వసనీయ కోల్పోలేదని అన్నారు. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉందన్నారు. నాయకుడిలోనే మార్పు ఉందని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget