News
News
X

Srikanth and Jafrin Meet CM Jagan: సీఎం జగన్ కలిసిన క్రీడాకారులు శ్రీకాంత్‌, జాఫ్రిన్- బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన జగన్

క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాము ముందంటామని తెలిపారు సీఎం జగన్. క్రీడాకారులు శ్రీకాంత్, జాఫ్రిన్ తనను కలిసిన సందర్భంగా వాళ్లను సన్మానించారు.

FOLLOW US: 

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్‌. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా సీఎం ప్రశంసించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్‌ను కూడా సీఎం అభినందించారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. 

శ్రీకాంత్, జాఫ్రిన్‌ను ఘనంగా సన్మానించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు సీఎం. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్న సీఎం ఆకాంక్షించారు. 

ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున సీఎం వైఎస్‌ జగన్‌కు బ్యాడ్మింటన్‌ కిట్‌ అందజేశారు ఏపీబీఏ ప్రెసిడెంట్‌ ముక్కాల ద్వారకానాథ్‌. ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధా ముకుంద, కేవీఎస్‌ కృష్ణ, షేక్‌ జాఫ్రిన్‌ తండ్రి షేక్‌ జకీర్‌ అహ్మద్, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్, శాప్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Published at : 24 Jun 2022 05:01 PM (IST) Tags: cm jagan srikanth Jafrin

సంబంధిత కథనాలు

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?

TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం  - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు  !

Guntur News : కార్పొరేషన్ అధికారులపై కార్పొరేటర్లు ఫైర్, అవినీతిపై హాట్ కామెంట్స్

Guntur News :  కార్పొరేషన్ అధికారులపై కార్పొరేటర్లు ఫైర్, అవినీతిపై హాట్ కామెంట్స్

AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !

AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!