By: ABP Desam | Updated at : 23 Mar 2023 12:49 PM (IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
అత్యంత ఉత్కంఠతో సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఓటు వేశారు. చాలా కాలంగా పార్టీకి శాసన సభకు దూరంగా ఉంటున్న ఆయన ఓటు వేయడానికి వస్తారా రారా అనే అనుమానాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తన రాజీనామా ఆమోదించారంటూ రాత్రి నుంచి ఒకటే దుష్ప్రచారం నడుస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు. రెండేళ్ల క్రితం రాజీనామా చేశానని గుర్తు చేశారాయ. వ్యక్తిగతంగా రెండుసార్లు కలిసి ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్టు కూడా వివరించారు. ఎన్ని చేసినా ఆమోదించిన స్పీకర్ ఇప్పుడు ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. గంటలో ఓటింగ్ అనగానే ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది సాధ్యమయ్యేది కాదన్నారు. తమ పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసారు.
రెండేళ్ల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఉద్యమకారులు, మీడియా ముందు తన రాజీనామా పత్రంపై సంతకం చేసి స్పీకర్‌కు పంపించారు. అప్పటి నుంచి శాసనసభకు హాజరుకావడం లేదు. తన రాజీనామాను ఆమోదించాలంటూ చాలా సార్లు మీడయా ముఖంగా, వ్యక్తిగతంగా స్పీకర్‌కు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్ని గంటల సమయం ఉందన్న టైంలో గంటా రాజీనామాను ఆమోదించారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఒక్క ఓటు అధికార పక్షం నుంచి వస్తే గెలుస్తామన్న ధీమాలో ఉన్న టీడీపీకి ఇది పెద్ద షాకింగ్ వార్తలా కనిపించింది. అయితే రూల్స్ ప్రకారం గంటా రాజీనామా ఆమోదించినా ఓటు వేసే హక్కు పోదన్న రాజ్యాంగ నిపుణుల సలహాతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. తర్వాత రాజీనామా ఆమోదం వార్త వదంతులేనని తేలిపోయింది.
టీడీపీ తరపున బరిలో పంచుమర్తి అనూరాధ
వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బరిలో జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బరిలో విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికల పై దిశా నిర్దేశం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారింది.
ఒక్క ఓటుతో మారిపోనున్న ఓ అభ్యర్థి జాతకం !
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా… చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. అలా జిల్లాకు ఒకరు చొప్పున సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం విషయంలో ఆయన టెన్షన్ పడిపోతున్నారు. సీఎం జగన్ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ పలు మార్లు నిర్వహించారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లారు.
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్