అన్వేషించండి

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

ఎమ్మెల్యే శ్రీ‌దేవి అవినీతి...సొంత పార్టి నేత‌ల ఆరోప‌ణ‌లు

తాడికొండ వైసీపీ రాజ‌కీయం ర‌స‌వత్తరంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవిపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ప‌ర్యవేక్ష‌కుడిని నియ‌మించింది. దీంతో ఈ వ్యవ‌హ‌రంపై అధికార వైసీపీలో విభేదాలు తలెత్తుతున్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక నేత‌ను ప‌ర్యవేక్షకుడిగా నియ‌మించ‌టంపై ఎమ్మెల్యే శ్రీ‌దేవి బ‌హిరంగంగానే నిర‌స‌న వ్యక్తం చేశారు. ఆ త‌రువాత పార్టీ నేత‌లు ఆమెకు న‌చ్చచెప్పేందుకు ప్రయ‌త్నించారు. అయితే ఇప్పుడు తాజాగా శ్రీ‌దేవి అవినీతిపై విచార‌ణ చేయించాల‌ని సొంత పార్టీ నేత‌లు డిమాండ్ చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.
వివాదాలు, సంచలనాలకు కేంద్రంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం 
వైసీపీ రాజకీయాల్లో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం ఎపిసోడ్ టీవీ సీరియ‌ల్ సాగిన‌ట్లు సాగుతోంది. మొదట్నుంచీ ఈ నియోజ‌క‌వ‌ర్గం వివాదాలు, సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా ఉంది. ఇప్పుటికీ ఇదే సీన్ కంటిన్యూ అవుతోంది. స్దానిక వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ మ‌ధ్య మెద‌లైన వివాదం ఇప్పుడు సొంత పార్టీ నేత‌లే ఎమ్మెల్యే పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసే వ‌ర‌కు వెళ్లింది. ఏకంగా ఏసీబీ విచార‌ణ జ‌రిపించాల‌ని స్దానిక పార్టీ నాయ‌కులు డిమాండ్ చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌లే ఎమ్మెల్యే శ్రీ‌దేవి పై పార్టీ అధిష్టానం ప‌ర్యవేక్షకుడిని నియ‌మించింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ ను పార్టీ అధిష్టానం ప‌ర్యవేక్షకుడిగా బాధ్యత‌లు క‌ట్టబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ర్యవేక్షకుడిని నియ‌మించ‌టంపై శ్రీ‌దేవి తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. పార్టీ నాయ‌కులు వ‌ద్ద కూడా పంచాయితీ జ‌రిగింది. ఎమ్మెల్సీ డొక్కా సైతం ఈ విష‌యంలో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయ‌త్నించిన‌ప్పటికి శ్రీ‌దేవి వ‌ర్గం స‌సేమిరా అంటూ భీష్మించుకున్నారు. ఈ విష‌యంలో శ్రీ‌దేవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిసేందుకు ప్రయ‌త్నించిన‌ప్పటికీ అవ‌కాశం లేక‌పోయింది. దీంతో ఆమెలో అసంతృప్తి ఇంకా పెరిగింది.
పార్టీ నేత‌ల నుండి ద‌క్కని మద్దతు...
ఇటు పార్టీ నేత‌లు కూడా శ్రీ‌దేవి వైఖ‌రిని ఉద్దేశించి పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ చ‌ర్చకు దారితీశాయి. శ్రీ‌దేవిని స్వయంగా సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి రాజ‌ధాని ప్రాంతంలో కీల‌కం అయిన తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం సీటు ఇచ్చి గెలిపించ‌టంలో కీల‌కపాత్ర పోషించారు. ఆ త‌రువాత నుండి ప‌రిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వ‌రుస వివాదాల్లో కంటిన్యూ అవుతున్న శ్రీ‌దేవిపై పార్టీ నేత‌లు అసంతృప్తిగా ఉండ‌టం, ఈ విష‌యం సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్ళటం, ఆయ‌న పీకే స‌ర్వే నుండి తెప్పించుకున్న రిపోర్ట్ ప్రకారం చ‌ర్యలు చేప‌ట్టారని సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌ర్యవేక్షకుడిని నియ‌మిస్తున్నట్లుగా ప్రక‌ట‌న వెలువ‌బ‌డిన వెంట‌నే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సుచ‌రిత ఇంటి ముందు శ్రీ‌దేవి ఆందోళ‌న‌కు దిగారు. ఇది పార్టీలో హాట్ టాపిక్ అయింది. క‌నీసం నాయ‌కుల‌తో మాట్లాడ‌కుండా, సొంత పార్టీ నేత‌లకు వ్యతిరేకంగా శ్రీ‌దేవి, ఆమె అనుచ‌రులు క‌ల‌సి ఆందోళ‌న‌కు దిగ‌టం వివాదాస్పదమైంది.
అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన సొంత పార్టీ నేత‌లు
ఎమ్మెల్యే శ్రీ‌దేవి పై సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. గ‌డిచిన మూడున్నర ఏళ్లుగా శ్రీ‌దేవి హ‌యాంలో నియోజక‌వ‌ర్గంలో జ‌రిగిన ప‌నులుపై విచార‌ణ చేయించాల‌ని మేడికొండూరు జెడ్పీటీసీ స‌భ్యుడు కందుల సిద్దయ్య మాట్లాడుతూ.. పార్టీ ప‌ద‌వుల‌ను శ్రీ‌దేవి అమ్ముకున్నార‌ని ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎదైనా అభివృద్ది ప‌నులు చేయాలంటే ముందుగా ఎమ్మెల్యేల‌కు ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌రిస్దితులు ఉన్నాయ‌ని మండ‌ల పార్టీ ప్రచార క‌మిటి అధ్యక్షుడు సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget