NH 65 Bundh: హైదరాబాద్-విజయవాడ హైవే బంద్! కొత్త రూట్ చెప్పిన పోలీసులు - విశాఖకూ ఇదే దారి
హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వయా విజయవాడ మీదుగా అదేవిధంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ ప్రయాణించే వాహనదారులు ఈ కింద తెలిపిన మార్గాల ద్వారా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ నగరాల మధ్య కీసర గ్రామం వద్ద (నందిగామ మండలం, ఎన్.టి.ఆర్.జిల్లా) NH 65 హైవే పై మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందని తెలిపారు. అందువల్ల వాహనాల రాకపోకలకు వీలు లేదని, అందువల్ల హైదరాబాద్ – విజయవాడ, విజయవాడ – హైదరాబాద్ ల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల క్షేమం కోరి వాహనాలను అనుమతించడం లేదని గురువారం (జూలై 27) రాత్రి ఓ ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
NH-65 Vijayawada-Hyderabad at keesara tollplaza
— Bhanu Prathap (@Bhanuprathapp1) July 27, 2023
munneru river😱 pic.twitter.com/ghM5c7mq8Z
కాబట్టి, ఈ విషయాన్ని గమనించి హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వయా విజయవాడ మీదుగా అదేవిధంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ ప్రయాణించే వాహనదారులు ఈ కింద తెలిపిన మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.
• హైదరాబాద్ – నార్కెట్ పల్లి – మిర్యాలగూడ – దాచేపల్లి – పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి – విశాఖపట్నంకు వెళ్ళాలి.
• విశాఖపట్నం- రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్ళాలి
వాహనాదారులు తమ ప్రయాణాలను ఈ కొత్త మార్గాల ద్వారా మార్చుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, వాహనదారులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం కోసం పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాలని సూచించారు.
వరద ప్రభావ ప్రాంతాలను, హైదరాబాద్ to విజయవాడ హైవేపై వరద పరిస్థితులను, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్ గున్ని ఐ.పి.యస్ .గారు.#highway #floodaffected #Floods #RestrictedArea #policeonduty #patrolling #vijayawadacity #NTRDistrict pic.twitter.com/uov6KshAu1
— Vijayawada City Police (@VjaCityPolice) July 27, 2023
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించు వాహనదారులకు ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ వారి ముఖ్య గమనిక.#highway #floodaffected #RestrictedArea #policeonduty #patrolling #vijayawadacity #NTRDistrict #AndhraPradeshPolice @APPOLICE100 pic.twitter.com/z6pegHyk4r
— Vijayawada City Police (@VjaCityPolice) July 27, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

