New Districts In AP: ఏ క్షణంలోనైనా కొత్త జిల్లాల నోటిఫికేషన్- కొత్త రెవెన్యూ డివిజన్ల జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 24 రెవెన్యూ డివిజన్లు- కేబినెట్ నోట్ విడుదల చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు కూడా మారుతున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు పూర్తైంది. ఏ క్షణమైనా జిల్లాలకు సంబంధించిన నోటఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైనట్టే కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లోనే నోటిఫికేషన్ రానుంది. కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం... రెవెన్యూ డివిజన్లలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జిల్లాలకు సంబంధించిన తుది కరెక్షన్లు పూరైనట్టు తెలుస్తోంది. కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ చేశారని సమాచారం. అందులో ఫైనల్ లిస్ట్ ఉందట.
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు కాబోయే 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ఇప్పటికే 49 డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 24 ఏర్పాటు కానున్నాయి.
CM Jagan: చంద్రబాబుకు సీఎం జగన్ ఉగాది గిఫ్ట్- అభిమాన నటుడికి మాత్రం నిరాశేhttps://t.co/8483yuhy87#CMJagan #NewDistricts #Ugadi #APNews #Chandrababu #NTR
— ABP Desam (@ABPDesam) March 31, 2022
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగల బదిలీలు, కేటాయింపులు ఉంటాయి. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిసైడ్ చేస్తారు.
ఏపీలో కొత్త జిల్లాల హడావిడి... నిర్ణయాలు సరైనవేనా అనే అనుమానాలు#newdistricts #AndhraPradesh https://t.co/Ip2TD26I4a
— ABP Desam (@ABPDesam) March 31, 2022
కొత్తగా వచ్చే రెవెన్యూ డివిజన్లు ఇవే:-
శ్రీకాకుళం జిల్లా- పలాస,
విజయనగరం- బొబ్బిలి, చీపురులపల్లి,
విశాఖ- భీమిలి,
కోనసీమ- కొత్తపేట
పశ్చిమగోదావరి- భీమవరం
కృష్ణాజిల్లా- ఉయ్యూరు
ఎన్టీఆర్ జిల్లా- తిరువూరు, నందిగామ
బాపట్ల- బాపట్ల, చీరాల
పల్నాడు- సత్తెనపల్లి
ప్రకాశం జిల్లా- కనిగిరి
కర్నూలు జిల్లా- పత్తికొండ
నంద్యాల జిల్లా - ఆత్మకూరు, డోన్
అనంతపురం- గుంతకల్
శ్రీసత్యసాయి జిల్లా- పుట్టపర్తి
అన్నమయ్య- రాయచోటి
చిత్తూరు జిల్లా- నగరి, పలమనేరు, కుప్పం
తిరుపతి- శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు.#YSJaganMarkGovernance #newdistricts#AndhraPradesh pic.twitter.com/HlSKXUJMnD
— 🆈🆂🆁🅲🅿 🅺🅰🅳🅰🅿🅰 (@ysrcpkadapa7) March 30, 2022
IAS TRANSFERS#AP#NEWDISTRICTS pic.twitter.com/LSAxmOuBpi
— శరత్ చంద్ర (@sarathvja) April 2, 2022