అన్వేషించండి

Nara Lokesh Challenges Jagan: డీఎస్సీపై చర్చకు వస్తావా ? జగన్ ఇంటి సమీపం నుంచే మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్

Nara Lokesh Challenges Jagan over DSC Issue | మెగా డీఎస్సీని వైఎస్ జగన్ ఆపలేరని, దమ్ముంటే ఎవరైనా వచ్చి తనతో చర్చకు సిద్ధమా అని మంత్రి నారా లోకేష్ చాలెంజ్ చేశారు.

Nara Lokesh Challenges Jagan | అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి సమీపం నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. తాడేపల్లిలోని జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడుతున్నానని, గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం తాము కాదన్నారు. ఏపీ మెగా డీఎస్సీ (DSC) నిర్వహణ, టీచర్ పోస్టుల నియామకాలపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలున్నా, వాటికి సమాధానం చెప్పేందుకు తానే స్వయంగా సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

జగన్ ఎన్ని జన్మలెత్తినా ఏపీలో డీఎస్సీ నియామకాలను ఆపలేరని నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా 'సాక్షి క్యాలెండర్' కాకుండా, తాము నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే వారికి హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియపై అవగాహన ఉండేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పులివెందుల ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం జగన్.. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ లూప్‌ను వీడి, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తేనే ఇక్కడి అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ రౌడీల మధ్య ఉండే వైసీపీ అధినేత జగన్, మహిళలను కించపరిచే వారిని, తిట్టే వారిని తన చుట్టూ పెట్టుకుంటారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్డుకు, పరిశ్రమకు తేడా తెలియని వాళ్లు మంత్రులుగా చేయడం వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు.

Also Read: AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?

అమర్నాథ్‌పై జగన్ ప్రశంసలు దురదృష్టకరం..
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్‌పై జగన్ ప్రశంసలు కురిపించడం దురదృష్టకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ వైసీపీ నేతలు హోం మంత్రి వంగలపూడ అనితని అవమానించినట్లే, జగన్ భార్య భారతీరెడ్డిని లేదా ఆయన ఇద్దరు కుమార్తెలను ఎవరైనా అవమానిస్తే జగన్ ఇలాగే శభాష్ అంటారా? అని నిలదీశారు. టీడీపీ పార్టీకి అలాంటి నీచమైన సంస్కృతి లేదని, అందుకే జగన్ కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో కించపరిచిన వారిపై కూడా తాము చర్యలు తీసుకున్నామని నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడి నుంచే నెగ్గాలని భావించాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పోరాడి ఇదే సీటు తీసుకున్నాను. ఏపీలో టాప్ 3 మెజారిటీ నియోజకవర్గాల్లో ఒకటిగా మంగళగిరి నిలిచింది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తెరిచి తక్కువ ధరకు పేదల ఆకలి తీర్చుతున్నాం. అనాడు  అన్న ఎన్టీఆర్ స్థాపించిన లైబ్రరీని అభివృద్ధి చేస్తున్నాం. చిన్న కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీని తీసుకురావడంలో ఎంపీ కృషి ఉంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం ముందుండేలా కృషి చేస్తానన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల ఫించన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తల్లికి వందనంతో ఎంత మంది పిల్లలున్నా వారికి ఆర్థిక సాయం. అన్నదాతలకు కేంద్రం, రాష్ట్రం కలిపి 20 వేలు ఏడాదికి ఇస్తున్నాం. SIR ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు వద్దన్నారు. కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవాలని కొత్త వారికి సైతం సూచిస్తున్నామని’ అన్నారు.

Frequently Asked Questions

నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు సవాల్ విసిరారు?

ఏపీ మెగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల నియామకాలపై ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పేందుకు నారా లోకేష్ జగన్‌మోహన్ రెడ్డికి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

వైసీపీ హయాంలో డీఎస్సీపై నారా లోకేష్ ఏ వ్యాఖ్యలు చేశారు?

వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని లోకేశ్ విమర్శించారు. వారికి హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియపై అవగాహన లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగుల కోసం టీడీపీ ప్రభుత్వం ఎలాంటి క్యాలెండర్‌ను ప్రకటిస్తోంది?

గత ప్రభుత్వం 'సాక్షి క్యాలెండర్' ప్రకటించగా, టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తోందని నారా లోకేశ్ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget