అన్వేషించండి

CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు

One Family One Entrepreneur policy AP: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. పలువురు వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం అయ్యారు. పెట్టుబడులకు మోదీ ఎకోసిస్టం భరోసా ఉంటుందన్నారు.

Singapore venture capitalists invest in AP startups: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విస్తృతస్థాయి భేటీలు నిర్వహించారు. సింగపూర్‌లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే, స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు,  ఐక్యరాజ్యసమితికి చెందిన  యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. నవ్యాంధ్ర గ్లోబల్ పార్ట్‌నర్‌గా మారడానికి సింగపూర్ కంపెనీలు ముందుకు రావాలని కోరుతూ.. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

 రాష్ట్రంలో పెట్టుబడులకు  మోదీ ఎకో సిస్టం  భరోసా 

భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక ఆలోచనల కారణంగా భారతదేశంలో బ్యూరోక్రసీ జాప్యం లేకుండా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కొనియాడారు. ఒకప్పుడు ‘హిందూ గ్రోత్ రేట్’ చాలా తక్కువగా ఉండేదని హేళన చేసిన వారే, ఇప్పుడు భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఏపీలో షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్‌వో  కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ.. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఏపీ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం కుదరాలని ఆయన ఆకాంక్షించారు.
 
వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ 

సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం ఒక కీలక నినాదాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి తాము  వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ అనే వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది అయిన భూ సమీకరణ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలకు తాము ఎంత వేగంగా భూములు, అనుమతులు ఇచ్చామో వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్  ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  

 రైతులకు మేలు.. హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులు 

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యం లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారని చంద్రబాబు అంతర్జాతీయ ప్రతినిధులకు తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన హార్టికల్చర్ పంట ఉత్పత్తులను ఏపీ నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, ఆహార రంగంలో ట్రేసబిలిటీ విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్ తయారీ రంగానికి ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని, సింగపూర్ టెక్ అవసరాలను తీర్చగల నిపుణులైన యువశక్తి  రాష్ట్రంలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

 యూఎన్ హాబిటాట్‌తో కీలక ఒప్పందం 

పర్యటనలో మరో కీలక మైలురాయిగా.. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో  యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  ఏర్పాటుకు ఉచితంగా భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. తీరప్రాంత నగరాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించే  రైజప్ కార్యక్రమాన్ని, మురికివాడల అభివృద్ధి కోసం  పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రామ్  ను ఏపీలో అమలు చేయాలని ప్రతిపాదించారు. 2028 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి ఒక పక్కా టైమ్‌లైన్‌తో కూడిన ఎంవోయూ   ఖరారు చేయాలని, మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ వాతావరణ నిధులను సమీకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సెప్టెంబర్‌లోనే పోలింగ్? క్షేత్రస్థాయిలో కూటమి స్పీడ్!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సెప్టెంబర్‌లోనే పోలింగ్? క్షేత్రస్థాయిలో కూటమి స్పీడ్!
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Jagan 2.0 Super App Launched: వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Embed widget