Amaravati News: బాలకృష్ణ గుడ్‌న్యూస్! ఇక అమరావతిలోనూ బసవతారకం ఆస్పత్రి - త్వరలోనే నిర్మాణం
AP Telugu News: క్యాన్సర్‌కి నాణ్యమైన చికిత్సను అతితక్కువ ఖర్చుతో అందించడంలో బసవతారకం హాస్పిటల్ ఎంతో పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భార్య బసవతారకం జ్ఞాపకార్థం ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
Nandmuri Balakrishna: ఏపీ ప్రజలకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతిలో కూడా నిర్మించనున్నట్లుగా వెల్లడించారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్సకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఆస్పత్రి ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంది. దీన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తామని బాలకృష్ణ చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఏపీలో త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని వెల్లడించారు.
క్యాన్సర్ కు నాణ్యమైన చికిత్స అందించడంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎంతో పేరు సంపాదించిది. హైదరాబాద్ లో దీన్ని 22 జూన్ 2000న ప్రారంభించారు. ఇది నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ ఉమ్మడి సహకారంతో ఈ సంస్థ నడుస్తోంది.
మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ మెడిసిన్, ఓంకో అనస్థీషియా, ఆంకో పాథాలజీ, సోషల్ వెల్ఫేర్, లేబొరేటరీ మెడిసిన్ వంటి క్యాన్సర్ కేర్‌లో వివిధ ప్రత్యేకతలు బసవతారకం ఆస్పత్రిలో ఉన్నాయి. హైదరాబాద్ లోని ఆస్పత్రి దాదాపు 650 పడకల సామర్థ్యం కలిగి ఉంది. 2021 సంవత్సరంలో బెస్ట్ ఆంకాలజీ ఆసుపత్రుల్లో దేశంలోనే ఆరవ ఉత్తమ క్యాన్సర్ సెంటర్‌గా ర్యాంక్ పొందింది.