అన్వేషించండి

Ambati Rambabu: పవన్ ప్యాకేజీ స్టార్ అని మళ్లీ నిరూపితం - అంబటి రాంబాబు ఎద్దేవా

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమి కాదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజమండ్రి టీడీపీ, జనసేన మీటింగ్‌తో జరిగేది, ఒరిగేది ఏమీ లేదని ధ్వజమెత్తారు.

టీడీపీ - జనసేన పార్టీలు సమన్వయ సమావేశం నిర్వహించడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ఈ సమావేశంతో ఆయన మరోసారి నిరూపించుకున్నాడని అంబటి అన్నారు. సున్నా సున్నా కలిస్తే సున్నానే వస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పని చేశాడని, తాజాగా మరోసారి నిరూపితం అయిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమి కాదని ఎద్దేవా చేశారు. రాజమండ్రి టీడీపీ, జనసేన మీటింగ్‌తో జరిగేది, ఒరిగేది ఏమీ లేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్లినట్లుగా పవన్ కల్యాణ్ చెప్తున్నాడని.. లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని అన్నారు. అసలు టీడీపీ, జనసేన సమావేశంలో ఏదైనా విషయం ఉందా అని కొట్టిపారేశారు. బలహీన పడ్డ టీడీపీని బలోపేతం చేయడానికి పవన్ కల్యాణ్ శ్రమిస్తున్నాడని.. ఈ కలవడాన్ని ప్రజలు ఒప్పుకోబోరని అన్నారు. తాము ఎప్పటినుంచో వీళ్ళు కలిసే పోటీ చేస్తారని చెప్తూనే ఉన్నామని.. తాజాగా తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతుందని అన్నారు. 

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను హింసించినప్పుడు, అరెస్ట్‌ చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని అంబటి రాంబాబు అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అని చెప్తున్నామని.. లోకేష్ అమిత్ షాని కలవడానికి పదే పదే ప్రాధేయపడ్డాడని అన్నారు. నిన్నటి దాకా లోకేష్ ఎన్ని అబద్దాలు చెప్పారని.. కిషన్‌రెడ్డి ప్రకటనతో లోకేష్ చెప్పినవన్నీ తప్పులని తేలిపోయిందని అన్నారు. పురంధేశ్వరి తప్పుడు విధానాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయని అన్నారు.

అసలు తెగులు టీడీపీనే - అంబటి
చంద్రబాబుకి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాదని.. బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా అని అంబటి రాంబాబు అన్నారు. పవన్ ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు నిన్న ఉత్తరంలో తాను జైలులో లేను.. ప్రజల మధ్య ఉన్నాననని అన్నారు. తెలుగు రాష్ట్రానికి తెగులు తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. ఇప్పుడు ఆ తెగులు పవన్ కళ్యాణ్‌కి కూడా పట్టుకుందని.. అక్రమంగా 45 రోజులు జైలులో పెట్టడం సాధ్యమా? చంద్రబాబుపై కేసులు ఉన్నాయి కాబట్టే, ఆయనకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. 

గతంలో ఓటుకు నోట్లు కేసులో కూడా రేవంత్ రెడ్డితో డబ్బులు పంపాడని ఆరోపించారు. ఏ వ్యవస్థని అయినా మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడే కదా అని ఆరోపించారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసే కదా చంద్రబాబు తప్పించుకున్నారని.. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని అన్నారు. చంద్రబాబు దొరికిన దొంగ అని.. ఆఖరికి ఆయన ఉన్న ఇల్లు కూడా అక్రమ మార్గంలో పొందినదేనని ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget