Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు - దుబాయ్ నుంచి సమీక్ష ముఖ్యమంత్రి సమీక్ష
Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్‌జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీనిపై అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Andhra Pradesh Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత పడుతోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి కృష్ణా జిల్లా వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. దుబాయ్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాం.
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. పట్టణాల్లో డ్రైనిజీల క్లియర్ చేసుకుని వర్షపు నీరు ఎప్పటికప్పుడు పోయేలా చూడాలని తెలిపింది. ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బ్యాగ్స్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉన్నందున యంత్రాంగం అలెర్ట్ గా ఉండాలని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు రైతులు పంట పొలాల్లో ఉండొద్దని హితవు పలికింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. .
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోనీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.





















