News
News
X

Rompicharla: టీడీపీ లీడర్‌పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం

టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు.

FOLLOW US: 
Share:

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు కాగా, అతణ్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులను గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు అనే వ్యక్తులు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పని చేశారు. పక్కా ప్లాన్ తో రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు. బలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ సీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించామని టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు చెప్పారు.

కొద్ది రోజుల క్రితమే ఈయనపై హత్యాయత్నం

వెన్నా బాల కోటిరెడ్డిపై కొద్ది నెలల క్రితమే కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఆ సమయంతో త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బాల కోటిరెడ్డి బయటపడ్డాడు. అలవల గ్రామంలోనే ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బాలకోటి రెడ్డిని వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైద్యం అందించారు. 

గొడ్డళ్లతో దాడి ఘటనను అప్పట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఇది వైసీపీ రౌడీల పనేనని ఆరోపించారు. సీఎం జగన్ ఫ్యాక్షన్ భావాల్ని నరనరానా నింపుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని అన్నారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైఎస్ఆర్ సీపీ రౌడీ మూకల్ని హెచ్చరిస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ సీపీ గుండాలకు ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే పథకం అమలు చేస్తామని తేల్చి చెప్పారు. అలా తాము చేస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు మీరు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని అచ్చెన్నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు.

ఎమ్మెల్యే ఖండన

వెన్నా బాలకోటి రెడ్డిపై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఖండించారు. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయవద్దని అన్నారు. టీడీపీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరే హత్యాయత్నానికి కారణమని అన్నారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన వెంకటేశ్వరరెడ్డి తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారని అన్నారు. దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేతలకు సవాలు చేశారు. అవసరమైతే తన కాల్ డేటా తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఎవరు ఎవరితో మాట్లాడారో కనిపెట్టాలని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు తాను చెప్పినట్లుగా చెప్పారు.

‘‘కాల్ డేటా తీద్దాం. ఎవరు ఎవరితో మాట్లాడారో తెలిసిపోతుంది. తుపాకీ సరఫరా చేసిన వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తులు అందరిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ కల్చర్ రావటం దురదృష్టకరమని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారందరిని అరెస్టు చేయమని పోలీసులకు చెప్పాను. నేను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధం’’ అని గోపిరెడ్డి స్పష్టం చేశారు.

Published at : 02 Feb 2023 08:43 AM (IST) Tags: YSRCP Leaders Venna balakoti reddy Guntur TDP news Rompicharla gun fire Rompicharla mandal MLA Gopireddy srinivas reddy

సంబంధిత కథనాలు

KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

TDP On Mlc Elections : ఇది కదా దేవుడి స్క్రిప్ట్, జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది - గంటా శ్రీనివాసరావు

TDP On Mlc Elections : ఇది కదా దేవుడి స్క్రిప్ట్, జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది - గంటా శ్రీనివాసరావు

YSR Asara Scheme: మహిళలకు ఏపీ సర్కారు శుభవార్త - 25న మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ

YSR Asara Scheme: మహిళలకు ఏపీ సర్కారు శుభవార్త - 25న మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

టాప్ స్టోరీస్

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ