Tenali Accident Video: తెనాలిలో కారు భీభత్సం! సడెన్‌గా ముగ్గురిపైకి ఎక్కేసి - వైరల్ వీడియో
Tenali వన్ టౌన్ పోలీసులు, క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
Tenali Car Accident: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కారు నానా భీభత్సం చేసింది. ఆ సమయంలో ఆ కారును ఇద్దరు మైనర్లు నడుపుతున్నారు. ఆ కారు దుగ్గిరాల నుంచి తెనాలికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు మైనర్లు అతివేగంగా కారు నడపడంతో తెనాలి పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న రిక్షాలు రిపేర్ చేసే దూకాణంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆ షాపులో ముగ్గురు వ్యక్తులు పని చేస్తున్నారు. కారు వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు నుజ్జు నుజ్జయింది. పక్కనే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి వన్ టౌన్ పోలీసులు, క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
కారును మలుపు తిప్పుతున్న క్రమంలో బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కినట్లుగా వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఒక్కసారిగా యాక్సిలరేటర్ తొక్కడంతో నియంత్రణ కోల్పోయిన కారు దూకాణంలోకి దూసుకెళ్లింది.