Viral News: ఐపీఎస్ పెళ్లిలో కాంగ్రెస్ జెండా వివాదం- సినిమాటిక్ ట్విస్టులతో సాగిన వివాహం
Guntur Latest News: ఐపీఎస్ పెళ్లిలో కాంగ్రెస్ జెండా వివాదం రేపింది. అలగడాలు, గుండెపోట్లు, గంటల వ్యవధిలోనే చాలా జరిగాయి. మొత్తానికి పెళ్లి వివాదం సుఖాంతమైంది
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఐపీఎస్ పెళ్లిలో వివాదం చోటు చేసుకుంది. పార్టీ జెండాలు ఉన్నాయని పెళ్లికి ఆటంకం ఏర్పడింది. విషయం నిరసనల వరకు వెళ్లింది. అనేక ట్విస్ట్‌లతో మొత్తానికి కథ సుఖాంతమైంది.
గుంటూరు నగరంలో ఓ ఐపీఎస్ వివాహం వివాదాస్పదమైంది. తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తెతో వివాహం నిశ్చమైంది. పెళ్లి కోసం గుంటూరులోనే ధూమ్‌ధామ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడే ఓ వివాదం చెలరేగింది.
అసలే రాజకీయ నాయకుడి కుమార్తె. అందులోనూ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడి కూతురు. ఇంకేం ఉంది పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేసిన అనుచరులు పార్టీ జెండాలను కూడా కట్టేశారు. శుభాకాంక్షలు, స్వాగతాలు ఇలా రకరకాలుగా కాంగ్రెస్ జెండాలతో నింపేశారు. ఇదే పెళ్లిలో వివాదానికి కారణమైంది.
ఓ ఐపీఎస్ పెళ్లి అని ఇందులో ఓ పార్టీ జెండాలు ఎందుకని ఆ అధికారి అభ్యంతరం చెప్పాడు. అసలే పరిస్థితులు బాగాలేవని ఎందుకొచ్చిన తంటాలే అని అనుకున్నారు. అందుకే జెండాల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేశారు. అంతే వెంటనే జెండాలు తీసేయాలంటూ ఆదేశాలు జారీ చేశాడు.
ఐపీఎస్ అల్లుడు అభ్యంతరం చెప్పినా కాంగ్రెస్ జెండాల ఊరేగింపు ఆపలేదు అనుచరులు. చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కొడుకు నాకీ పెళ్లి వద్దని అలిగాడు. అల్లుడు పంచాయితీ అత్తమామల వరకు వెళ్లింది. అంతే స్పాట్‌లోనే అత్త పడిపోయారు. ఆమెను ఆస్పుత్రికి తీసుకెళ్లారు.
జరిగిన పరిణామాలతో కలత చెందిన ఆ నాయకుడి ఫ్యామిలీ ఐపీఎస్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందనుకున్న ఆ అధికారి మనసు మార్చుకున్నాడు. అందరూ సర్ది చెప్పడంతో పెళ్లికి అంగీకరించాడు. ఇద్దరి పెళ్లితో కథ సుఖాంతమైంది.