అన్వేషించండి

CBI On Jagan: వివిధ కారణాలు చెప్పి విదేశాలకు వెళ్తున్నారు- విచారణలో జాప్యం జరుగుతుంది- జగన్ పారిస్‌ టూర్‌పై సీబీఐ అభ్యంతరం

ఏదో కారణం చెప్పి విదేశాలకు వెళ్తున్నారు. ఇలావెళ్లడం విచారణకు ఆటంకం కలుగుతుందని సీబీఐ కోర్టుకు అధికారులు తెలిపారు. సీఎం జగన్ ఫారిన్ టూర్‌పై గట్టి వాదనలు వినిపించారు.

సీఎం జగన్ పారిస్‌ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమార్తె కాలేజీ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతికి సీఎం జగన్ రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. జగన్‌ అభ్యర్థనపై అభ్యంతరం చెప్పింది. పారిస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు తెలియజేశారు సీబీఐ అధికారులు. వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని ఇది విచారణపై ప్రభావం పడుతుందని వివరించింది. జగన్ పారిస్‌ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది సీబీఐ.

కోర్టు అనుమతితో ఇటీవలే దావోస్ టూర్‌కు వెళ్లివచ్చిన సీఎం జగన్... మరోసారి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న జగన్... వారం రోజులపాటు దావోస్‌లో వ్యక్తిగత పర్యటన చేశారు. మరోసారి పారిస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి పూర్తిగా వ్యక్తిగత పర్యటన. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి చదువుతున్నారు. 

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్‌లో మాస్టర్స్ చదువుతున్నారు హర్షారెడ్డి. గ్రాడ్యూయేషన్ సెర్మనీ ఉండటంతో ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఆ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో కుటుంబ పర్యటనలో వారిద్దరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు జగన్ కుమార్తె ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 

సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget