అన్వేషించండి

Atchannaidu: జేబులోకి 10 వేల కోట్ల కోసమే లిక్కర్ పాలసీ మార్పు, జగన్ కుట్ర ఇదీ: అచ్చెన్నాయుడు

Atchannaidu On CM Jagan: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం (మార్చి 24) అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఏపీలో మద్యం విధానాన్ని సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే మార్చుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మద్యం కంపెనీలు, షాపులు తమ చేతిలోకి రావాలనే ఉద్దేశం దీని వెనక ఉందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు లిక్కర్ పైన రూ.10 వేల కోట్ల ఆదాయం కోసం జగన్ పని చేస్తున్నారని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం (మార్చి 24) మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు.

టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పేదల పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డిస్టిలరీలన్నీ జగన్ బినామీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.11,569 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుతం విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.24,714 కోట్ల ఆదాయం వస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన సొంత జేబులకు రూ.10 వేల కోట్లు రావడం కోసం ఇప్పుడు మద్యం పాలసీని సీఎం జగన్ మార్చుకున్నారని జగన్‌ విమర్శించారు. శాసన సభలో నిన్న ఏపీ సీఎం జగన్‌ అన్నీ అబద్ధాలు మాట్లాడారని తెలిపారు.

ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లకు చంద్రబాబు సర్కారే అనుమతి ఇచ్చిందని సీఎం జగన్ ఆరోపించారు. 254 కొత్త మద్యం బ్రాండ్లకు బాబు సర్కార్ అనుమతిని ఇచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం బ్రాండ్లన్నింటికీ చంద్రబాబే అనుమతి ఇచ్చారని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఏపీలో చీప్ లిక్కర్ లేనే లేదన్నారు.  చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మరోవైపు, జంగారెడ్డి గూడెం మరణాలపై నిన్న టీడీపీ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద టీడీపీ నిరసనకు దిగిన సమయంలోనే ఏపీ అసెంబ్లీలో మద్యంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget