అన్వేషించండి

Cyclone Damage in AP: తుపాను నష్ట పరిహారం కోసం సిఫార్సు చేయండి - కేంద్ర బృందాన్ని కోరిన జగన్

Cyclone in AP: తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు.

AP News: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర  ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉ‍న్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయని సదరు బృందం తెలిపింది. ఏపీలో అమలవుతున్న ఈ- క్రాపింగ్‌ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపిన కేంద్ర బృందం ఇవి ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని పేర్కొంది.  మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది.

రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నాం :  తాము పరిశీలించిన అంశాలను  సీఎం జగన్‌కు  కేంద్ర బృందం అధికారులు వివరించారు. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని, మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామని  కేంద్ర బృందం వివరించింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించామన్న సభ్యులు వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని,  స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామని  కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం తెలిపింది. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చ జరిగింది. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని,  అలాగే ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామన్న కేంద్ర బృందం ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ,  కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీకూడా తాము స్వయంగా చూశామని, ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వెల్లడించింది.  కౌలు రైతులకు కూడా ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయమని,కేంద్ర బృందం తెలిపింది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సూచించింది.  పెసలు, మినుములు, మిల్లెట్స్‌ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఉపాధిహామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైనా కేంద్ర బృందానికి రాష్ట్రాధికారులు వివరాలు తెలిపారు. పెండింగులో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరారు.  తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని  అధికారులు వివరించారు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని  అధికారులు కోరారు.

అత్యంత పారదర్శకత వ్యవస్థ : తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను  సీఎం జగన్‌ వివరించారు.  ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని, తుపాను ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కాని ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందని, దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని  సీఎం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని అధికారులు తెలిపారు.  తమ రాష్ట్రంలో ఈ- క్రాపింగ్‌ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం పెడతామన్న సీఎం ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామని,  రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయని, దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget