By: Harish | Updated at : 18 Jan 2023 05:29 PM (IST)
ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది రూ.9225.28 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది రూ.9225.28 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. షెడ్యూల్ కులాల వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎస్సీలపై పూర్తి స్థాయి నివేదిక...
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో బుధవారం ప్రారంభమైన రెండు రోజుల తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతీయ సదస్సులో నాగార్జున పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగంగా జూన్ 2019 నుంచి 2022 డిసెంబర్ దాకా రూ.49,710.17 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 11.82 మంది ఎస్సీ పెన్షనర్ల కోసం రూ.7950.33 కోట్లను ఖర్చు చేసామని చెప్పారు.
అమ్మఒడి పథకం ద్వారా 26.56 లక్షల మంది తల్లులకు రూ.2715.35 కోట్లను ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 33.50 లక్షల మంది లబ్దిదారులకు రూ.2567.63 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకం కింద 17.89 లక్షల మందికి రూ.3356.41 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద 2.44 లక్షల మందికి రూ.243.72 కోట్ల రుపాయలను అందించామని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద 3.39 లక్షల మందికి 7.95 కోట్లు, జగనన్న చేదోడు పథకం కింద 48 వేల మందికి రూ.43.98 కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2437 మందికి రూ.5.81 కోట్లు, మత్స్యకార భరోసా పథకం కింద 3283 మందికి రూ.3.28 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద 3.89 లక్షల మంది విద్యార్థులకు రూ.668.995 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద 4.44 లక్షల మంది విద్యార్థులకు రూ.1755.35 కోట్లు అందించామని చెప్పారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన...
2023-24కిగానూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 60 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.21.55 కోట్లు, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం కింద రూ.211.63 కోట్లు అందించనున్నామని నాగార్జున వివరించారు. నాన్ డీబీటి ద్వారా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ విద్యా కానుక, జగనన్న ఇళ్లు, వైఎస్సార్ కంటి వెలుగు, తదితర పథకాల కింద 56.32 మంది లబ్దిదారులకు రూ.28,958.30 కోట్ల రుపాయలను అందించామని వెల్లడించారు. ఎస్సీ వర్గాలకు చెందిన వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా గురుకులాలు, నీట్, జెఇఇ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నామని, స్పోర్ట్స్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద దోషులను శిక్షించడానికి, బాధితులను అవసరమైన సహాయాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ బాధితులకు రూ.148.11 కోట్ల సాయాన్ని అందించామని నాగార్జున చెప్పారు. అలాగే రూ.268.46 కోట్ల రుపాయల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోషియల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఈ ప్రాంతీయ సదస్సులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులు హజరయ్యారు.
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ