జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు
అధికారంలో ఉన్నప్పుడు హామీలు నెరవేర్చకుండా మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు జోగి రమేష్. కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారని ఎద్దేవా చేశారు జోగి.
మంత్రులంతా తనను, టీడీపీని తిట్టడానికి తప్ప వేరే పని చేయడం లేదన్న చంద్రబాబు కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు మంత్రిజోగి రమేష్. ఆరిపోయిన పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని ఆయన్ని తిట్టాల్సిన అవసరం టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేన్నారు. ఆయన జీవితం గురించి ఐటీడీపీకి తెలియదా అని ప్రశ్నించారు. అమరావతిలోని వైసీపీ పార్టీకార్యాలయంలో మాట్లాడిన జోగి రమేష్ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు జోగి రమేష్. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా హామీలు ఇచ్చారని వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రస్నించారు. డ్వాక్రా రుమాఫీ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. మంచి నీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారని ఆరోపించారు.
మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్తున్నాడు #TDPAntiPoor #EndOfTDP pic.twitter.com/SI8yyJDiXF
— Jogi Ramesh (@JogiRameshYSRCP) June 10, 2023
అప్పుడు హామీలు అమలు చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారని ఎద్దేవా చేశారు జోగి రమేష్. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబూ అని నిలదీశారు.. పేదలను ధనవంతులను చేస్తానంటున్న చంద్రబాబు.. ఇళ్లు ఇస్తుంటే కోర్టులకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మాట ఇస్తే చేసేందుకు ఎంతవరకైనా వెళ్లే జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు.
టీడీపీ పని అయిపొయింది...
— Jogi Ramesh (@JogiRameshYSRCP) June 10, 2023
చంద్రబాబు పని ఎప్పుడో అయిపొయింది.#TDPAntiPoor #EndOfTDP pic.twitter.com/54nCoYdmUz
చంద్రబాబు హయాంలో పూర్తి కాని భోగాపురం ఇప్పుడు శరవేగంగా జరుగుతోందన్నారు జోగి రమేష్. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయని తెలిపారు. చంద్రబాబు మాత్రం దీన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. పనులు చేయాలంటే కావాల్సింది మంత్రాలు కాదని... యుక్తి, ధీరత్వం కావాలన్నారు.
చంద్రబాబు పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.#TDPAntiPoor pic.twitter.com/y5ArSP9tyd
— Jogi Ramesh (@JogiRameshYSRCP) June 10, 2023
తామంతా ప్రజలు ఎన్నుకుంటే పదవుల్లో ఉన్నామన్నారు జోగి రమేష్. లోకేష్‌లా అడ్డంగా పదవుల్లోకి రాలేదన్నారు. తాము పప్పులం కాదన్నారు. ఉప్పుకారం తిని దమ్ముగా అధికారంలోకి వచ్చామని చెప్పుకొచ్చారు. జగన్ కేబినెట్‌లో ఉన్నందుకు తామంతా గర్వపడుతున్నామన్నారు జోగి రమేష్.
తమపై చంద్రబాబు సెటైర్లు బాగా వేశారని.... పది ఇళ్లు కూడా కట్టలేదన్నారని కానీ కట్టిన ఇళ్లు చూపిస్తాం వస్తారా అని ప్రశ్నించారు జోగి రమేష్. తలకిందులుగా తపస్సు చేసినా... పాదయాత్ర అని పొర్లు దండాలు పెట్టినా లోకేష్‌ను ప్రజలు ఎన్నుకోలేరని అన్నారు. లోకేష్‌ను కన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలని కామెంట్ చేశారు. లోకేష్ లాంటి పిల్లకుంకతో జగన్ చర్చకు రావడమేంటని ప్రశ్నించారు. లోకేష్ తన ఒళ్లును తగ్గించుకోవడానికి మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని విమర్సించారు.
చంద్రబాబు ఏమన్నారంటే...
ఉదయం లేచింది మొదలు తనను తిట్టడమే మంత్రులకు పెద్దపని ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐ టీడీపీ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో వివరాలను సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కల్పించింది ఐ-టీడీపీ నే అని ప్రశంసించారు. బీసీ (BC)ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం (Special Act) తెస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. అభద్రతకు గపరవుతున్నారని అన్నారు. బీసీలపై దాడులు పెరుగుతున్నాయని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమని అన్నారు.