అన్వేషించండి

Adimulapu Suresh: గురువుల కన్నా గూగులే మేలు వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ

గురువులను చులకన చేస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

AP Minister Adimulapu Suresh Comments on Teachers:

గురువులను చులకన చేస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువులు కన్నా గూగుల్ మేలు అని తాను అనలేదని, కానీ తాను అన్నట్లు వచ్చిన వార్తలను మంత్రి ఖండించారు. 

ఉపాధ్యాయులు దినోత్సవం వేదికగా...
ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే కొన్ని మీడియా సంస్థలు దానిని వక్రీకరించాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దీని ద్వారా ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తి గత దాడికి దిగే ప్రయత్నం చేశారని అన్నారు. తాను కూడా ఉపాధ్యాయునిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడాను అని  తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈరోజుల్లో ప్రతిఒక్కరు నిత్యం విద్యార్దులే అని చెబుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్దులు కావాలనే ఉద్దేశంతో మాట్లాడానన్నారు. 

టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని...
టెక్నాలజీ పెరిగిపోయి యాప్ లు, ట్యాబ్ లు వచ్చాయని మారిన కాలానికి అనువుగా అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. గూగుల్ లో సమాచారాన్ని వెతుకుతూ గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నానని సమాజంలో కొందరు వ్యంగ్యంగా మాట్లాడే విషయాన్ని ప్రస్తావించానన్నారు. గూగుల్ ను సృష్టించింది కూడా గురువులే కదా అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని.. టీచర్ల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని అని చెప్పారు. 

గతంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన విద్యా సంస్కరణల్లో తన కృషి, ఉపాధ్యాయ సంఘాలతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం పైన, ముఖ్యంగా తనపైన వ్యక్తిగతంగా బురదజల్లే కార్యక్రమం ఎల్లో మీడియా చేపట్టిందని దీనిని నమ్మవద్దని ఉపాధ్యాయులను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తూ వారికి అనుకూల పార్టీకి అనుకూలంగా కధనాలు ఇస్తూ రాజకీయం చేయటం జర్నలిజం అనిపించుకోదు అని హితవు పలికారు. ఇలాంటి వివాదాలు లేపి ఎవరికి లబ్ది చేకూర్చాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అనని మాటలను వక్రీకరించి వారికి అనువుగా పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్ హితవు పలికారు.

ఇంతకీ మంత్రి ఏమన్నారంటే..
‘బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ లలో వచ్చింది. ఓ పేరడి లాగ గురువులు అవసరం లేదు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చింది. గురువులకి తెలియని విషయాలు గూగుల్‌లో కొడితే మనకు తెలిసిపోతున్నాయి. సాంకేతికత మనకు అందుబాటులోకి వచ్చింది. మనం దాన్ని స్వీకరించడానికి అందుబాటులో ఉన్నామా లేదా’ అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీచర్ యూనియన్స్ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు దిగొచ్చి తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు.

Also Read: Andhra University: ఏయూ వీసీని తక్షణమే రీకాల్ చేయాలి - రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget