By: Harish | Updated at : 15 Feb 2023 06:17 PM (IST)
ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్న వైసీపీ ఎంపీ
AP Investmets : జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లోనే రికార్డు స్దాయిలో ఉద్యోగాలు కల్పించామని రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ప్రకటించారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన గణాంకాలు విడుదల చేశారు. పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా అవతరరించిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడేళ్లలోనే ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య 60% పెరగడంతోపాటు, ఉద్యోగాల కల్పనలో 38% పెరుగుదల నమోదు కావటం ఆహ్వనించతగిన పరిణామమని అన్నారు.
'ఎంఎస్ఎంఈ రీస్టార్ట్', 'వైయస్సార్ జగనన్న బడుగు వికాసం', 'డా. వైయస్సార్ నవోదయం' తదితర పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆయోధ్య రామిరెడ్డి వివరించారు. దూరదృష్టితో ఆలోచించే సీఎం జగన్ నాయకత్వం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి ప్రగతిపథంలో పురోగమిస్తోందని స్పష్టం చేశారు. పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ కల్పన గణనీయంగా పెరిగిందన్నారు. మూడేళ్ల క్రితం 37,956 ఉన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏకంగా 60,800 యూనిట్లకు పెరిగిందని, తద్వారా 5 లక్షల 61 వేల 235 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ఎంఎస్ఎంఈల వృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఖాతాలకు 'వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్'ను అందిస్తోందని రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వివరించారు.
డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం పథకం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రుణాల కోసం సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని,ఆయన వెల్లడించారు.అంతే కాదు..2021 నాటికే చూస్తే 1.78 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయని స్పష్టం చేశారు. అట్టడుగువర్గాల వ్యాపారాలను ప్రోత్సహించాలనే యోచనతో ప్రభుత్వం తెచ్చిన "వైయస్సార్ జగనన్న బడుగు వికాసం"తో 5 వేల 725 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ. 347 కోట్లు, 1138 ఎస్టీ పారిశ్రామికవేత్తల ఎంఎస్ఎంఈల యూనిట్లకు రూ. 66 కోట్లు విడుదల చేయటం జరిగిందని వెల్లడించారు.
మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. వైయస్సార్ ఆసరా ద్వారా 33.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2568 కోట్లు, వైయస్సార్ చేయూత కింద 17.89 లక్షల మందికి రూ. 3356 కోట్ల సాయం అందించామని,దీని పై జగన్ నిత్యం సమీక్ష చేస్తున్నారని ఆయన వెల్లడించారు.రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం కోసం, సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు 2022 జూలైలో రూ. 1.26 లక్షల కోట్లు, 2022 డిసెంబర్ లో రూ. 23,985 కోట్లు, 2023లో రూ. 1.44 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని వివరించారు. మొత్తంగా రూ. 2.93 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఏపీకి తెచ్చినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు.
విశాఖపట్టణం కేంద్రంగా జరిగే ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వార ఆంధ్రప్రదేశ్ కు మరింత పెట్టుబడులు వస్తాయనటంలో సందేహం లేదని ఆయోధ్య రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.విపత్కర పరిస్దితులను సైతం అధిగమించి ,ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు,ఉపాది అవకాశాలు,యువతకు భరోసా కల్పించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నం లో రాజకీయ కోణం చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం- జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్బర్గ్, కొత్త రిపోర్ట్పై సిగ్నల్
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ