అన్వేషించండి

ఏపీలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలకు ప్రభుత్వం నిర్ణయం: మంత్రి కొట్టు సత్యనారాయణ

ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటీకరణ చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

ఏపీ వ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటీకరణ చేపడుతున్నామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ప్రైవేట్ సాఫ్ట్ వేర్ సంస్థ భాగస్వామ్యంతో కంప్యూటరీకరణ చేస్తున్నామని తెలిపారు.
దేవాదాయశాఖ అధికారులతో సమావేశం..
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను 2023 జనవరి 31 లోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాల్సిందిగా 9&9 సాప్ట్ వేర్ సంస్థను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దీని ద్వారా పారదర్శకతతో పాటు అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు. ఇప్పటికే 16 దేవాలయాల్లో అందుబాటులో ఉన్న కంప్యూటరీకరణ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. విజయవాడలోని  దేవాదాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని  ప్రముఖ 16 దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన పరదర్శకతో కూడిన సేవలందించాలని ఆదేశించారు. 16 ప్రధాన దేవాలయాల్లోనూ ఆన్లైన్ సిస్టమ్స్ పాటించాల్సిందిగా, కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం లేకుండా యూపీఎస్ లు వాడాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. వచ్చే సమావేశం నాటికి 175 దేవాలయాల్లోనూ కంప్యూటీకరణతో కూడిన ఆన్లైన్ సేవలను భక్తులకు అందించాలని మంత్రి ఆదేశించారు.
ధూప దీప నైవేద్యం పథకం...
ఈ సమావేశంలో 185  దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరు ప్రతిపాదనలు వచ్చాయని, ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (TMS)(9&9 సాప్ట్ వేర్) మీద రాష్ట్రంలో ఉన్న దేవాలయాల ఈవోలందరికీ తప్పనిసరిగా  సాఫ్ట్ వేర్ మీద పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి చెప్పారు. ప్రతి దేవాలయంలోను, సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా 9&9 సాప్ట్ వేర్ సంస్థ కు మంత్రి సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి 175  దేవాలయాల్లో ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్స్ పూర్తిస్థాయిగా అమలు చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్ (FAS)....
 సమావేశంలో  ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్ లో  ఆదాయ, రాబడుల వివరాలను మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. దీనిపై దేవాదాయ శాఖ పరిధిలోని ఈవోలకు పూర్తి అవగాహన కల్పించుకోవాలని మంత్రి అన్నారు. ఈ విషయమై తదుపరి సమీక్ష సమావేశం నాటికి కార్యనిర్వాహక అధికారులు స్వయంగా వివరించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రోటోకాల్ విభాగాన్ని అనుసరించేందుకు  తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కమిషనర్  ని ఆదేశించారు. దేవాలయాల్లో టెండర్లు ప్రాసెసింగ్ విధానం పారదర్శకంగా జరగాలన్నారు. అన్నదానం, శానిటేషన్ సిబ్బందిని  నియమించే విషయమై పారదర్శకత టెండర్ల విధానం ద్వారా మాత్రమే తీసుకోవాల్సిందిగా మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హరి జవహర్ లాల్, అదనపు కమిషనర్ టి. చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget