News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

నేరాల కట్టడికి టెక్నాలజియే ఆయుధం, దిశా యాప్ గుడ్ ఎగ్జాంపుల్, ట్రైనీ డీఎస్పీలకు డీజీపీ క్లాస్

లోన్ యాప్‌లపై వేధింపులపై పోలీసులు కఠినంగా వ్యవహరిచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

FOLLOW US: 
Share:

లోన్ యాప్‌లపై వేధింపులపై పోలీసులు కఠినంగా వ్యవహరిచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. లోన్ యాప్‌ల వ్యవహరంపై ట్రైనీ డీఎస్పీలకు డీజీపీ ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు.
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ డీఎస్పీలతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు. సమాజపరంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా వ్యహరించాలి, ప్రజలకు అందించాల్సిన సేవలపై  మాట్లాడారు. విధినిర్వహణ పోలీసు వ్యవస్థకు ఉత్తమ సేవలందించడం ద్వారా సమాజంలో మంచి పేరు సాధించుకోవాలని సూచించారు డీజీపీ. ప్రస్తుతం రుణపరమయిన అంశాలు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని, ప్రైవేట్ సంస్థల వేధింపులపై సామాన్యుడిని కాపాడాలని డీజీపీ సూచించారు. లోన్ యాప్‌ల వ్యవహరంలో సాంకేతిక సహకారాన్ని తీసుకొని కేసులు ఛేదించాల్సిన అవసరం ఉందని అన్నారు.

డీఎస్పీలు బాధ్యతతో నడవాలి
 విధుల నిర్వహణలో అంకితభావం, పారదర్శకత, క్రమశిక్షణ, మంచి ప్రవర్తనతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చూపాలని చెప్పారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా వ్యవహరించటం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి కృషి చేయటం, ప్రజలు సైబర్ నేరస్తుల బారిన పడకుండా అవగాహన కల్పించటం  వంటి అంశాలు కీలకంగా మారాయని అన్నారు. 

సైబర్ నేరాల పై ప్రత్యేకక టోల్ ఫ్రీ..
సైబర్ మోసాల అడ్డుకట్ట కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సైబర్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు డీజీపీ.  మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పోలీసుశాఖలు కృషి చేస్తున్నాయని, మహిళల రక్షణ కవచంగా దిశ యాప్ పని చేస్తోందన్నారు.  దిశ కాల్స్‌కు సకాలంలో పోలీసులు సత్వరమే స్పందించడం, ఆయా ప్రాంతాలకు వెళ్తుండటం వల్ల చాలా వరకు నేరాలు తగ్గాయని చెప్పారు. మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని దిశ యాప్ ప్రాధాన్యతను వివరిస్తూ మహిళల మొబైల్ ఫోన్లలో సుమారు 1.22 కోట్లు దిశా యాప్ ను డౌన్లోడ్ చేయించామని వివరించారు.

సాంతికేత సహకారం ముఖ్యం...
నేరాలు జరుగకుండా ప్రివెన్సన్, డిటెక్సన్‌ల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని డీజీపీ అన్నారు. చట్టాలను ఉపయోగించి నేరాలు తగ్గేందుకు కృషి జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో రౌడీ కార్యకలాపాలు, గూండాలను నియంత్రించామని, రాష్ట్ర వ్యాప్తంగా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్‌లో భాగంగా 122 కీలక కేసులను గుర్తించినట్టు తెలిపారు.  సత్వర చర్యల కోసం యూనిట్ పోలీసు అధికారులకు అప్పగించామని వివరించారు. సక్సెస్‌గా అందరూ ఈ కేసుల్లో అత్యంత స్వల్ప వ్యవధిలో చర్యలు చేపట్టి తొందరగా చార్జిషీటు వేశారని, తద్వారా న్యాయ విచారణ జరిగి నిందితులకు శిక్ష పడటం వల్ల మళ్లీ నేరాలు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Published at : 30 Jun 2023 09:37 AM (IST) Tags: AP Crime Disha APP Rajendranath Reddy DGP ap plice

ఇవి కూడా చూడండి

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

AP Revenue Services Association: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక, ఐదోసారి అధ్యక్షుడిగా బొప్పరాజు

AP Revenue Services Association: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక, ఐదోసారి అధ్యక్షుడిగా బొప్పరాజు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్