YSRCP Politics: పిల్లి తీరుపై సీఎం జగన్ అసహనం, గందరగోళానికి గురిచేస్తే సహించేది లేదంటూ ఆగ్రహం!
Pilli Subhash Chandra Bose Meets AP CM YS Jagan: రామచంద్రాపురం నియోజకవర్గం సీటు వ్యవహరంలో పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి క్లియర్ గా ప్రకటన చేశారు.
Pilli Subhash Chandra Bose Meets AP CM YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. తాజాగా సంచలనం రేకెత్తించినన రామచంద్రాపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతలకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు.
ముఖ్యమంత్రితో వేణు బేటీ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మిథున్ రెడ్డి మఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలపై మిథున్ రెడ్డి, సీఎం కు వివరించారు. మరో వైపున నియోజకవర్గంలో పరిస్దితులు , మంత్రి వేణు వైఖరిని గురించి కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టిలో అంతర్గతంగా ఉన్న విభేదాలను క్లియర్ చేసే బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించారు.
ఉమ్మడి జిల్లాలో వైసీపి పరిస్థితి ఏంటి...
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిస్దితులు ప్రస్తుతం వైసీపీకి ఇరకాటంగా మారిన నేపద్యంలో పార్టి వ్యవహారాల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి బాధ్యతలు చూస్తున్న ఎంపీ మిథున్ రెడ్డితో ముఖ్యమంత్రి బేటీ అయ్యారు. తాజాగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. పార్టీ పరిస్థితులను గురించి స్దానిక నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇలాంటివి ఎందుకు...
తాజాగా రామచంద్రాపురం నియోజకవర్గం పరిస్థితులు పై ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితులు రావటం సర్వసాధారణం అయిననప్పటికి, పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురి చేసే పరిస్థితులు వస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మరో వైపున పలువురు నాయకులు తెలుగుదేశం నేతలను కలిసేందుకు ప్రయత్నించటం, సీట్ల సర్దుబాటు వ్యవహరంలో బాహాటంగా మాట్లాడటంపై జగన్ నాయకులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. పార్టీ లైన్ ను కాదని, పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయటం, దాని వలన కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లటం, వలన కలిగే నష్టాలను గురించి అప్రమపత్తంగా ఉండాలని నాయకులను ముఖ్యమంత్రి అలర్ట్ చేశారు.
పిల్లి తీరుపై సీఎం అసహనం...
ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గం సీటు వ్యవహరంలో పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి క్లియర్ గా ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో రామచంద్రాపురం సీటు ను చెల్లుబోయిన వేణుగో పాల్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే సీటును పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ కూడ అడుగుతున్న క్రమంలో సీటు వ్యవహరంపై దుమారం మొదలైంది. ఇదే సమయంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి, సమావేశాలు పెట్టుకోవటం, పార్టీ నాయకులపై దాడులు చేసుకునే పరిస్దితులు వరకు వెళ్లింది. దీని పై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా కూడ జగన్ పుల్ సపోర్ట్ చేసిన క్రమంలో ఇలాంటి రాజకీయ పరిస్దితులు, క్రియేట్ చేసి పార్టిని ఇరకాటంలోకి నెట్టటంపై పార్టి నేతలు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial