అన్వేషించండి

Andhra Pradesh: ఉచిత ఇసుక పాలసీలో మరో ముందడగు- అందుబాటులోకి ఆన్‌లైన్‌ బుకింగ్ సదుపాయం

Chandra Babu: ఏపీలో అమలు అవుతున్న ఉచిత ఇసక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. బుధవారం సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం దాన్ని మరింత పారదర్శకంగా ఇంటికి చేర్చేందుకు మరో విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం గనుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్విహంచిన సీఎం చంద్రబాబు ఇందులో ఉన్న లోటుపాటు ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక బుకింగ్‌, ట్రాన్స్‌పోర్ట్, నిఘా వంటి అంశాలపై ఆరా తీశారు. దీనిపై కొన్ని సూచనలు చేశారు. 

గ్రామవార్డు సచివాలయాల్లో ఇసుకను ఉచితంగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది అన్న విషయం నేరుగా వినియోగదారులకే తెలుస్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఇంటికి ఇసుకు చేరుతుందన్నారు. 

ఇలా ఇసుకను ఆన్లైన్‌లో బుకింగ్ చేయడం వల్ల బుకింగ్ సులభతరం అవుతుందని, రీచ్‌ల వద్ద రద్దీ కూడా ఉండబోదన్నారు. ప్రజలకు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇసుక రవాణా చేసే వాహనాలకు ఎంపానల్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం గుర్తించిన వెహికల్స్ మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఇక్కడ వినియోగదారుల వద్ద సొంత వెహికల్ ఉంటే కూడా ఇసుక తీసుకెళ్లవచ్చని అన్నారు.  

ఇలా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టేందుకు ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీ ఎంక్వయిరీ జరగాలని చంద్రబాబు సూచించారు. ఇలా చేస్తే పారదర్శకత వస్తుందని నిజమైన వియోగదారులకే ఇసుక చేరుతుందన్నారు. రవాణా రేట్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. 

ప్రైవేట్ వ్యక్తుల ఇసుకను బల్క్‌గా బుక్ చేసుకునేందుకు సపరేట్‌ ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఇలా బల్క్‌గా ఇసుక తీసుకెళ్లేవాళ్లు జీఎస్టీ, ప్రాజెక్టు వివరాలు, సైట్ వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. అలాంటి ప్రాజెక్టులను అధికారులు సందర్శించి వివరాలు నమోదు చేస్తారు. దీనికి అయ్యే ఖర్చంతా ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది. 

ఉచితంగా ఇసుక రవాణా చేసే వాహనాలకు బ్యానర్లు పెట్టాలని, వాటికి ఆన్‌లైన్ ట్రాకర్‌ కూడా అమర్చాలన్నారు. నిఘా వ్యవస్థను జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు, ఎస్పీలతో మరింత పటిష్ట పరచాలన్నారు. ఇంకా సమస్యలు ఉంటే బాధితులు 1800-599-4599కి ఫోన్ చేసి లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget