CM Chandrababu: కాన్వాయ్‌లోని డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా
Andhra Pradesh News | కాన్వాయ్‌లోని డ్రైవర్ మృతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Chandrababu condoles the death of the driver AP CM Convoy | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు డ్రైవర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అమీన్ బాబు కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
Also Read: P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు






















