అన్వేషించండి

P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | రాష్ట్రంలో పీ4 విధానాన్ని ఉగాది (Ugadi) నుంచి ప్రారంభిచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు.

AP CM Chandrababu | అమరావతి: పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పీ4 విధానాన్ని ఉగాది (Ugadi 2025) పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. పీ4 విధానం (P4 Model) ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది... అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. పీ4 విధానం (పబ్లిక్- ప్రైవేట్- పీపుల్స్- పార్ట్నర్‌షిప్)పై విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

ప్లానింగ్ శాఖపై సచివాయంలో సమీక్ష

పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి, తగిన మార్పులు చేర్పులు చేసిన అనంతరం ఏపీలో పీ4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.  ప్లానింగ్ శాఖపై సచివాయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్ధాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వీరందర్నీ ఒక ప్లాట్‌ఫాం కిందకు తెచ్చి రాష్ట్రంలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామన్నారు. దాంతోపాటు ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి, వారికి సాయం చేస్తామన్నారు. అందుకు అవసరమైన డేటాను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

పేదరిక నిర్మూలనకు పీ4 మోడల్‌

తమ సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని... అలా ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా పేదరిక నిర్మూలనకు పీ4 మోడల్‌ను రాష్ట్రంలో ఆవిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సరికొత్త విధానం అమలు ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Also Read: Pawan Kalyan Latest News: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Kadiri BJP RDO Office Protest: కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!
కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!
DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget