అన్వేషించండి

మీ అనుభవం ఏపీ అభివృద్ధికి అవసరం- నాటా మహాసభల్లో ఎన్‌ఆర్‌ఐలకు సీఎం జగన్ సందేశం

వేరే దేశంలో ఉన్నా తెలుగువారంతా సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఐకమత్యాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు.

గ్లోబల్‌ సిటిజన్‌గా మనం ఎదగాలంటే చదువే పెద్ద సాధనం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ తన సందేశాన్ని అందించారు. 

వేరే దేశంలో ఉన్నా తెలుగువారంతా సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఐకమత్యాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. తెలుగు వారు అమెరికాలోని పెద్ద, పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరు గర్వం కలిగిస్తుందని అన్నారు. తెలుగు వారు అక్కడ ఉన్నప్పటికి వారి మూలాలు, మన మట్టిలో ఉన్నాయని అన్నారు. అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా, అక్కడకి వెళ్లి రాణించడం వెనుక, ఎంతో కఠోరమైన కమిట్‌మెంట్, ఫోకస్‌ వారిని నిలబెట్టాయన్నారు. 

నా కళ్ళారా చూశాను..అందుకే....
కమిట్‌మెంట్, ఫోకస్‌ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉందని దాన్ని తన కళ్లారా చూశానని జగన్ అన్నారు. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో నాలుగేళ్ల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగామని చెప్పారు.  గ్లోబల్‌ సిటిజన్‌గా మనం ఎదగాలంటే, చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనంగా పేర్కొన్నారు. విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పుల్లో భాగంగా సర్కారీ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు.  నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నామని, స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నట్లు వెల్లడించారు. 

ఎనిమిదో తరగతిలోకి రాగానే ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు, ట్యాబ్‌లు ఇస్తున్నాం,  మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లను నియమించామని చెప్పారు జగన్. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్‌ విద్యను అందించేలా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 6వతరగతి ఆపైన అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు పూర్తి అవుతుందని అన్నారు.

విద్యార్దులకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు..
అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులని, చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలనిన అన్నారు. కేవలం విద్యా రంగం ఒక్కటే కాదు, ఏ రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయని అన్నారు.

ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ పాఠాలు..
ప్రతి గ్రామంలోనూ ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తాయని, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను స్కూలు పిల్లలు చదువుతున్నారని అన్నారు. ఇంగ్లీషు అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియంగా జగన్ అభివర్ణించారు.  పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్‌ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా ముందు వారికి ఇంగ్లీష్‌ మీద పూర్తిస్థాయిలో పట్టు రవాలని అందుకే సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని చెప్పారు.

అభివృద్ధిలో భాగమవ్వండి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న  అభివృద్ధి  ఒక్కసారి  చూడాలని తెలుగు ఎన్‌ఆర్‌ఐను ఆహ్వానించారు సీఎం జగన్. పోర్ట్‌లు  ఎయిర్పోర్ట్‌లు మెరుగు పడుతున్నాయన్నారు. విదేశాల్లో  ఉన్న  ఎన్‌ఆర్‌ఐ సేవలు  ఏపీ కి  ఎంతో  అవసరమని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో  ఉండి  అపార అనుభవం  సంపాదించారు.. ఏపీలో  అభివృద్ధి  కోసం  ఆ అనుభవం సహకరించేలా  ఉండాలన్నారు. గ్రామీణ  ప్రాంతాల్లో  ఆర్ధిక  అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అందరూ  వినియోగదారులు  అయితే  ఉత్పత్తి  ఉండదని... ఉత్పత్తిదారులు  ఉండకపోతే  భవిష్యత్‌లో  ఆహార కొరత  వస్తుందన్నారు. రూరల్  ఎకానమీపై దృష్టి  పెట్టాల్సిన  అవసరం  ఉందని గుర్తు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget