అన్వేషించండి

CPS Cancelation: సీపీఎస్‌ రద్దు అంశంపై కీలక అడుగు- ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు

సీపీఎస్‌ రద్దు అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగా సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దీన్ని గ్రహించిన ప్రభుత్వం... చర్చలు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సమస్య కోసం కమిటీ వేస్తున్నట్టు 716 నెంబర్‌ జీవో ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఈకమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉంటారు. వీళ్లే ఉద్యోగ సంఘాలతో చర్చించి సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తుది నివేదిక సమర్పించడానికి ఎలాంటి గడవులు పెట్టలేదు. 

కమిటీ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమైంది. సీపీఎస్‌ రద్దు అంశంపై చర్చించింది. 
అమరావతిలోని సచివాలయం చర్చలు జరిగాయి. ఈ భేటీకి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,  ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. 

ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ పీఆర్టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీయుటిఎఫ్ అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపిటిఎఫ్ అధ్యక్షుడు హృదయ రాజు పాల్గొన్నారు. 

సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయుల ఇచ్చిన చలో విజయవాడను భగ్నం చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టులు చేశారు. గృహనిర్బంధంలో ఉంచారు. సీఎం ఇంటి చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు. మారువేషాల్లో వస్తారని గ్రహించి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జల్లెడ పట్టారు. 

విజయవాడ మొత్తం పోలీసు వలయంలో చిక్కుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) మండిపడ్డారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. విజయవాడను పోలీసు వలయంలో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని అడిగారు. శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గం అన్నారు. విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు (CPS Cancel) చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, మడమ తిప్పారని సెటైర్ వేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణం అని రామకృష్ణ అన్నారు.

ఎక్కడికక్కడ అరెస్టులు.. 
సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సంఘాలు సీఎంవో ముట్టడి (UTF Chalo AP CMO)కి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. నిన్నటి నుంచే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా నిఘా పటిష్టం చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి విజయవాడ వెళ్లే బస్సులు సైతం రద్దు చేశారు. ఉపాధ్యాయుల సెలవులను సైతం రద్దు చేస్తూ ఛలో సీఎంవోను అడ్డుకునే ప్రయత్నం జరిగిందంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు.

యూటీఎఫ్ నేతలు ఆగ్రహం..
తాము విజయవాడ వెళ్లకుండా చూసేందుకే బస్సులు రద్దు చేస్తున్నారని యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనను అడ్డుకునేందుకు విజయవాడ బస్సులు రద్దు చేయడంతో సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారని, గుర్తింపు కార్డులు తనిఖీ చేసి తాడేపల్లి వైపు వెళ్తున్న 40 మంది ఉపాధ్యాయులు అరెస్టు చేశారని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సైతం మరికొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget