అన్వేషించండి

Amaravati Real Estate: అమరావతి భూముల ధరలకు రెక్కలు, దాదాపు పది రెట్లు పెరిగిన ల్యాండ్ రేట్లు

Amaravathi Real Estate with TDP coming to power: గత కొన్ని నెలల నుంచి అమరావతి భూములకు రెక్కలొస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చి చంద్రబాబు సీఎం కాగానే ధరలు మరింత పెరిగాయి.

Amaravati Lands for Sale: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి.  నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే  తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది. 

మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో..  ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వంపై రాజధాని అమరావతి ప్రజల్లో కూడగట్టుకున్న వ్యతిరేకత సైతం కూటమికి ఓటు వేసేలా చేసింది. చంద్రబాబు చేతికి తిరిగి పగ్గాలొస్తాయన్న భావించి, చంద్రబాబు సీఎం అయితే అమరావతినే రాజధానిగా అభివృద్ది చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ధరలు పెరిగేలా చేయడానికి కారణమైంది.

ఆరు నెలల్లో పది రెట్లకు పైగా.. 

గడిచిన ఆరు నెలల్లో అమరావతి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు తదితర ప్రాంతాలు,  తాడేపల్లి మండలం లోని పెనుమాక, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకు రూ. 3,500 నుంచి రూ.4,000 వరకు ఉన్న గజం భూమి ఏకంగా రూ.45 వేలకు చేరిపోయిందని ఇక్కడి రియల్టర్లు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి కొనాలంటే 15 నుంచి 20 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సమీపంలోని గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లోనూ రియల్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల ఒకటో తేదీ వరకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు రూ.40 లక్షల నుంచి 45 లక్షల  మధ్య ఉండగా ఇప్పుడు 50 లక్షలు పైమాటే పలుకుతున్నాయంటున్నారు. నిర్మాణంలో ఉన్నవాటిని హాట్ కేకుల్లా అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఎటు చూసినా రియల్టర్ల హడావుడి, ప్రాంతాన్ని బాగుచేస్తోన్న కార్మికుల గలగలతో సందడి వాతావరణం నెలకొంది.  

తీర్పుతో పునరుత్తేజం

జూన్ 4న కూటమికి విజయాన్ని అందిస్తూ ఎన్నికల ఫలితాలు రావడంతో.. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల ఆశలు, కలలు నిజమయ్యాయి. దాదాపు 1600 రోెజులకు పైగా సుదీర్ఘంగా సాగిన అమరావతి రాజధాని ఉద్యమానికి తెరపడినట్లయింది.  సరికొత్త ఆశలతో రాజధాని ప్రాంతమంతా ఊపిరి తీసుకుంది.   అమరావతి ప్రాంతంలో కూటమి గెలుపు దరిమిలా నేతల నుంచి సంకేతాలు వెళ్లడంతో అధికారులు బాగుచేత పనులు ప్రారంభించారు.  గత ప్రభుత్వ హయాంలో తుప్పు బట్టిపోయిన పరికరాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుమ్మచెట్లు కొట్టేస్తూ రహదారులు సైతం నిర్మిస్తున్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో రాజధాని అంశంపై ఆయన చేసే ప్రకటనలతో ఈ బూమ్ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.  గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానంతో  నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ముఖ్యంగా తొలివారంలోనే కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై సమీక్షించే అవకాశముందని భావిస్తున్నారు.

అటూ ఇటూ వంద కిలోమీటర్ల పరిధిలో.. రియల్ పండగే.. 

తాజా పరిస్థితుల గతంలో రియల్ పెట్టుబడి పేరెత్తితే గతంలో హైదరాబాద్ వైపు చూసిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా ఊపందుకుంది. కేవలం రాజధాని ప్రాంతమే కాకుండా.. రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకే రియల్ బూమ్ పరిమితం కాకుండా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలపై ప్రభావం పడే అవకాశముందని రియల్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ తేడా కనిపించకపోయినా రానున్న రెండు మూడు నెలల్లో ధరలు విపరీతంగా పెరుగుతాయని చెబుతున్నారు.   

శరవేగంగా అభివృద్ధి పనులు 

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకూ రాత్రుళ్లు చీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్తు వెలుగులతో తళతళలాడుతోంది. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకూ ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్తు వెలుగులు పునరుద్ధరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో సోమవారానికే సీడ్ యాక్సిస్ రోడ్డంతా విద్యుత్తు వెలుగులు సంతరించుకుంది. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget