అన్వేషించండి

ACB Raids: నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు, బయటపడ్డ అక్రమాలు!

ACB Raids: పల్నాడు జిల్లా నరసరావు పేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. 

ACB Raids: అవినీతి ఆరోపణలు, అనేక ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాలు బయట పడినట్లు తెలుస్తోంది. ఆకస్మికంగా దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ ప్రతాప్ కుమార్, సిఐలు, ఎస్సైలు సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై అనేక ఫిర్యాదులు..

నరసరావు పేట మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైనే దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై అనేక ఫిర్యాదులు అందాయని, ఆ సెక్షన్ లోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఏసీబీ ఏఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. అందుకే ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 

తనిఖీల్లో అక్రమ కట్టడాల గుర్తింపు..

టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై ప్రధానంగా దృష్టి పెట్టి సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నరసరావు పేట మున్సిపల్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయా నిర్మాణాల కోసం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. లంచాలకు మరిగిన అధికారులు, ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తూ పోయారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి, అక్రమంగా భవనాలు నిర్మించినప్పటికీ... వాటిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ధ్రువీకరించడం వంటివి తనిఖీల్లో గమనించినట్లు ఏసీబీ ఏఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలు అన్నీ బయట పడతాయని వెల్లడించారు. 

సూళ్లూరుపేటలోనూ ఏసీబీ తనిఖీలు..

తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపల్ కార్యాలయంలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతులు, అక్రమ కట్టడాలు వంటి వాటిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నోట్ల కట్టలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

లక్షా 90 వేల నగదు స్వాధీనం..

సూళ్లూరుపేట మున్సిపల్  ఆఫీస్ పై ఉమ్మడి నెల్లూరు జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మోహన్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని పలు ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆ కంప్లైంట్స్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే... మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ కిటికీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టలు రెండు దొరికాయి. అలాగే వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి దొరికాయి. అనంతరం కమిషనర్ కారులో తనిఖీ చేయగా రూ. 50 వేలు లభ్యం అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల వద్ద సుమారు రూ.30 వేలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షల నగదును అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget