News
News
వీడియోలు ఆటలు
X

TDP News: సత్తెనపల్లి సీటు కోసం టీడీపీలో త్రిముఖ పోరు - చంద్రబాబు ఛాన్స్ ఇచ్చేది ఎవరికి?

ప్రతిపక్ష పార్టీ నాయకులలో సీటు కోసం జరుగుతున్న గొడవలు అధిష్టానానికి చికాకు తెప్పిస్తున్నాయి. ఈ గ్రూప్ తగాదాలు ఆ పార్టీ అభిమనులలో సైతం నిస్తేజాన్ని నింపుతున్నాయి.

FOLLOW US: 
Share:

ఏ మాత్రం కొంచెం కష్టపడినా ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం సులభం. ఇప్పటికే స్థానిక ఎంఎల్ఏపై పలు ఆరోపణలు రావడం ప్రతిపక్షానికి ప్లస్... కానీ అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులలో సీటు కోసం జరుగుతున్న గొడవలు అధిష్టానానికి చికాకు తెప్పిస్తున్నాయి. ఈ గ్రూప్ తగాదాలు ఆ పార్టీ అభిమనులలో సైతం నిస్తేజాన్ని నింపుతున్నాయి. నాయకులు ఏకతాటిగా నడవకపోతే.. విజయం సాధించే  సీటును  కోల్పోవడం తథ్యం మంటున్నారు నియోజకవర్గం ప్రజలు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా వీరికి జలక్ ఇచ్చి కొత్తగా పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెరమీదకు వచ్చారు.

కోడెల మరణం తరువాత... 
సత్తెనపల్లి నియోజకవర్గం పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. 2014లో కోడెల శివప్రసాద్ ఈ నియోజకవర్గం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్పీకర్ గా విధులు నిర్వహించారు. 2019 లో కోడెలను ఓడించి అంబటి రాంబాబు ఇక్కడ నుంచి విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. టీడీపీ పార్టీ ಓడిపోవడం ఆతర్వాత కోడెల మృతి తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇంచార్జ్  నియామకం జరగలేదు...
నియోజకవర్గం ఇంచార్జ్ పదవికోసం ముగ్గురు ఆశావాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసుకుంటున్నారు. తప్పు లేదు కానీ పార్టీ క్యాడర్ ను మూడు వర్గాలుగా చేసుకొని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చివరకు దాడులు కూడా చేసుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటున్నారు పార్టీ అభిమానులు. కోడెల వారసుడుగా తనకే ఇంచార్జ్ పదవి కావలని కోడెల కుమారుడు శివరాం  ఆశిస్తున్నారు. గతంలో ఎంఎల్ఏ గా పనిచేసిన అనుభవం ఉన్న వైవీ ఆంజనేయులు తను రేసులో ఉన్నానంటుండగా... ఆరంభం నుంచి పార్టీ కోసం కష్ట పడుతున్న తనకు ఏంతక్కువ అని టీడీపీ యువ నాయకుడు మల్లీ అడుగుతున్నారు.‌‌
కోడెల శివప్రసాదరావు మృతి చెందిన నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం లో‌‌ టీడీపీ  పార్టీ మూడు ముక్కల‌ ఆటను తలపిస్తుంది. క్రమ శిక్షణకు మరో రూపం టీడీపీ పార్టీ అని చెప్పుకుటారు. కానీ ఇక్కడ మాత్రం క్రమశిక్షణ మాత్రం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ముగ్గురూ ఏవరకి వారు పోటా పోటీగా పార్టీ కార్యక్రమాలను చేస్తు పార్టీ క్యాడర్ నే ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నో సార్లు అదిష్టానం గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని చూసింది.. ఈ ముగ్గుర్ని పిలిపించి మాట్లాడింది, అప్పటికి అధిష్టానం మాట శిరోధార్యం ఆనటం... ఆతర్వాత కథ మాములే...
గత రెండు సంవత్సరాల నుంచి‌ సత్తెనపల్లి టీడీపీలో ఇదే తంతు నడుస్తోంది..
గతంలో వైవీ. ఆంజనేయులు టీడీపీ ఎంఎల్ఏగా  సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆతర్వాత  పార్డీ నుంచి‌ అవకాశం దక్కలేదు. 2014లో కొడెల సత్తెనపల్లి నుంచి పోటీ  చేసి‌ విజయం సాధించడం, 2019లో ಓడిపోవడం జరిగింది. కోడెల‌ మరణం తర్వాత లైమ్ లైట్ లోకి నచ్చాడు  వైవీ. అదిష్టానం సత్తనపల్లి సీటు తనకే  ఇస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. కోడెల మరణం తర్వాత ఆయన కుమారుడు యాక్టివ్ అయ్యారు. సీటు తనకే కావాలంటూ పార్డీ కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు. సత్తెనపల్లి లో‌ టీడీపీ కార్యాలయం ఉన్న కోడెల శివప్రసాద్ తన  ఇంటి వద్దే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అదే‌ సాంప్రదాయాన్ని కోడెల కుమారుడు కోడెవ శివరాం కొసాగించారు.

వేరు వేరుగా కార్యక్రమాలు..
పార్టీకీ సంబంధించిన కార్యక్రమాలను కోడెల శివరాం తన ఇంటి వద్ద నుంచి నిర్వహించగా... వైవీ ఆంజనేయలు సత్తెనపల్లి లోని  టీడీపీ పార్టీ కార్యాలయం లో పార్డీ కార్యక్రమాలు పోటా పోటీగా నిర్వహించడం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలారు. కొంత మంది పార్టీ నాయకులు అయితే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడమే మాను కొన్నారు.

వేరు వేరుగా అన్నా క్యాంటీన్లు..
సత్తెనపల్లి లో‌ అన్నా క్యాంటీన్ లను కూడా ఎవరికి వారు ఏర్పాటు చేశారు. బస్టాండ్ సెంటర్ లో కోడెల శివరాం, పార్టీ‌‌ కార్యాలయం సమీపంలో వైవీ ఆంజనేయులు ప్రారంభించారు. అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ‌ సమయంలో గొడవ పడటం.... అన్నా క్యాంటీన్ ఏర్పాటును తెలియచేస్తూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సహితం ఒకరివి మరొకరు చించి వేయడంతో పార్టీ అదిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్యక్రమాలు వర్గాలుగా విడిపోయి చేయడంతో పార్టీ క్యాడర్ లో క్రమశిక్షణ లోపించింది. ఈ సంఘటన నడుమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తప్పనిసరిగా పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని ఆదేశించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.  పార్టీ ఆదేశాలను పాటిస్తూ కోడెల శివరాం పార్టీ ఆఫీస్‌ లో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్ళగా వైవీ వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు గ్రూపులు కుర్చీలతో దాడి చేసుకొని పార్టీ పరువును బజారుకు ఈడ్చారని పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాగర్ కాలువ కేంద్రంగా..
నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయక పోవడంతో ఆయకట్టు లక్ష ఎకరాలలో పంట ఎండిపోతుంది అంటు  రైతులు ఆందోళన చెందారు. కుడి కాలవకు నీరు విడుదల చేయాలంటూ సత్తెనపల్లి టీడీపీ  నాయకులు వైవీ ఆంజనేయులు, శివరాం, అబ్బూరి మల్లీ.. ఎవరికి వారు తమ గ్రూపులతో వెళ్ళి ఆందోళన చేశారు. వీళ్ళలో‌‌ వీళ్ళకే ఐఖ్యత లేదు ఇక పార్టీని ఏమి కాపాడతారంటూ ప్రజలలో చర్చ‌ మొదలైంది. ఆ తర్వాత టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు  జన్మదినం సందర్బంగా ఫ్లెక్సీల ఏర్పాటు సందర్భాలలో కూడా గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సైతం ఒకరి వర్గానివి మరొకరు చించివేశారు. 
స్థానిక ఎంఎల్ఏ మంత్రి అంబటి రాంబాబుపై ఈ ప్రాంతంలో కొంత‌ వ్యతిరేకత ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. టీడీపీ పార్టీ పట్ల ప్రజలలో‌ కొంత‌ సానుకూలత ఉంది. ఇలాంటి పరిస్థితిలో‌ కొద్దిగా కృషి చేసినా టీడీపీ విజయం సాధించండం సులభమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వర్గపోరుతో‌ చేతులారా గెలిచే సీటును వదిలేస్తున్నారని టీడీపీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

కన్నా రాక... ఖాయమా..
అయితే పార్టీలో రీసెంట్ గా జాయిన్ ఆయిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి పంచాయతీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదట. కాలక్షేపం చేస్తే అసలుకే మేసం రావడం ఖాయమంటున్నారు టీడీపీ అభిమానులు. ఈనెల 26 వ తేదిన సత్తెనపల్లిలో‌‌ జరిగే ఇదేమి ఖర్మ ఈ  రాష్ట్రానికి ప్రోగ్రామ్ లో చంద్రబాబు పాల్గోనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో‌ నియోజకవర్గం  టీడీపీ ఇంచార్జ్ ని ప్రకటిస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతోందా... ఏం జరుగుతుందో తెలియాలంటే ఒకట్రెండు వేచి చూడక తప్పదు. 

Published at : 24 Apr 2023 11:44 PM (IST) Tags: AP News AP Latest news Chandrababu TDP Kodela

సంబంధిత కథనాలు

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

టాప్ స్టోరీస్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు